బీభత్సం సృష్టిస్తున్న భారీ వరదలు.. 44 మంది మృత్యువాత

బీభత్సం సృష్టిస్తున్న భారీ వరదలు.. 44 మంది మృత్యువాత
పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 44 మంది వరకూ మరణించినట్టు జాతీయ విపత్తు సహాయ సంస్థ తెలిపింది.

ఇండోనేషియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కొండచరియలు విరిగిపడి పెద్ద సంఖ్యలో జనం మృత్యువాత పడ్డారు. పలువురు గాయపడ్డారు. అనేక ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వేలాది మంది నిరాశ్రయిలయ్యారు. ఇండోనేషియాలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నారు. నిన్న పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 44 మంది వరకూ మరణించినట్టు జాతీయ విపత్తు సహాయ సంస్థ తెలిపింది.

అనేక దీవుల సమాహారమైన ఆ దేశంలో ఏకంగా ఓ దీవి మొత్తం వరదల్లో మునిగిపోయినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తూర్పు నెసా తెంగారా ప్రావిన్స్‌లోని ఫ్లోర్స్ ద్వీపంలో కొండచరియలు విరిగిపడగా, 38 మంది మృతదేహాలను శిథాలాల కింద నుంచి వెలికి తీశారు. ఒయాంగ్ బయాంగ్ గ్రామంలో సుమారు 40 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముగ్గురు మృతదేహాలు వెలిగితీశారు. మరికొందరు బురదలో చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సహాయక సిబ్బంది చెబుతున్నారు. ఇప్పటికీ అనేక ప్రాంతాలు బురదమయంగానే ఉన్నాయి.

వరదల ఉధృతికి ఐలాండ్ తీర్పు ప్రాంతంలో పలు బ్రిడ్జిలు, రోడ్లు దెబ్బతిన్నాయి. ఈస్ట్ ఫ్లోర్స్ రెజెన్సీలోని సుదూర ప్రాంతాలకు చేరుకునేందుకు సహాయక సిబ్బందికి కష్టంగా మారింది. ఎడతెగని వర్షాలు, బలమైన గాలుల కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతున్నట్టు నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఏజెన్సీ తెలిపింది. ఇండోనేషియాలోని సగం జనాభా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాల్లోనే జీవనం సాగిస్తున్నట్టు అక్కడి అధికార వర్గాలు చెబుతున్నాయి.


Tags

Read MoreRead Less
Next Story