petrol: రూపాయిన్నరకే లీటర్ పెట్రోల్.. ఎక్కడో తెలుసా..

petrol: రూపాయిన్నరకే లీటర్ పెట్రోల్.. ఎక్కడో తెలుసా..
petrol: రోజు రోజుకు పెట్రోల్ ధరలు పెరగడమే కానీ తగ్గేదేలేదు అన్నట్లు ఉంటున్నాయి చమురు ధరలు మన దేశంలో.

petrol: రోజు రోజుకు పెట్రోల్ ధరలు పెరగడమే కానీ తగ్గేదేలేదు అన్నట్లు ఉంటున్నాయి చమురు ధరలు మన దేశంలో. కానీ వెనిజులా మాత్రం లీటర్ పెట్రోల్ ధర కేవలం 0.02 డాలర్లు.. అదే మన కరెన్సీలో లెక్క కడితే కేవలం రూపాయిన్నర మాత్రమే. అక్కడ చమురు నిల్వలు ఎక్కువగా ఉండడంతో ఆ దేశం పౌరులకు చవగ్గా పెట్రోల్, డీజిల్ అందిస్తోంది.

వెనిజులా తర్వాత పెట్రోల్ అతి తక్కువ ధరకే అందిస్తున్న దేశంగా ఇరాన్ నిలుస్తుంది. ఇక్కడ లీటర్ పెట్రోల్ 0.06 డాలర్లు. మన కరెన్సీలో రూ.4.51. ఆ తరువాత సిరియాలో లీటర్ పెట్రోల్ రూ.17లు. వీటి తర్వాత అంగోలా, అల్జేరియా, కువైట్, నైజీరియా, తుర్క్‌మెనిస్తాన్, ఖజకిస్తాన్, ఇథియోపియా దేశాల్లో 0.50 డాలర్ల లోపే అంటే రూ.40 లోపే లీటర్ పెట్రోల్ వస్తుంది.

అయితే కొన్ని దేశాల్లో మాత్రం పెట్రోల్ రేటు భగ్గుమంటోంది. చైనాలో అంతర్భాగమైన హాకాంగ్‌లో లీటర్ పెట్రోల్ ధర మన కరెన్సీలో చూస్తే రూ.1.92 దగ్గరగా ఉంది. తరవాత నెదర్లాండ్స్‌లో లీటర్ పెట్రోల్ రూ.1.63, సెంట్రల్ రిపబ్లిక్‌లో రూ.160గా ఉన్నాయి. తరువాతి స్థానాల్లో నార్వే, ఇజ్రాయిల్, డెన్మార్క్, మోనాకో, గ్రీస్, ఫిన్ లాండ్, ఐస్ ల్యాండ్ ఉన్నాయి. అక్కడ లీటర్ పెట్రోల్ రూ.150లు చెల్లించాలి.

Tags

Read MoreRead Less
Next Story