అంతర్జాతీయం

3000 skips: ఎత్తు పెరగాలంటే చెయ్యాల్సిందే.. అమ్మ పనిష్మెంట్.. దాంతో చిన్నారి పరిస్థితి..

3000 skips: నయానో, భయానో, నాలుగు చీవాట్లు పెట్టైనా సరైనా ఎలాగైనా భారీగా పెరిగిపోతున్న బరువు తగ్గించాలనుకుంది..

3000 skips: ఎత్తు పెరగాలంటే చెయ్యాల్సిందే.. అమ్మ పనిష్మెంట్.. దాంతో చిన్నారి పరిస్థితి..
X

3000 skips: నయానో, భయానో, నాలుగు చీవాట్లు పెట్టైనా సరైనా ఎలాగైనా భారీగా పెరిగిపోతున్న బరువు తగ్గించాలనుకుంది.. దాంతో పాటు కొంచెం ఎత్తు కూడా పెంచాలనుకుంది. డాక్టర్ సలహా తీసుకోకుండానే తనకి తెలిసిన వ్యాయామాన్ని 13 ఏళ్ల కూతురితో చేయించింది.. దాంతో ఇప్పుడు ఆ చిన్నారికి నాలుగు అడుగులు కూడా వేయలేని పరిస్థితి తలెత్తింది.

చైనాలోని జెన్‌జియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన ఓ మహిళ తన కుమార్తెను రోజుకు 3000 స్కిప్‌లు ఆడమని బలవంతం చేసేది. మోకాళ్లు నొప్పి పెడుతున్నాయని మొర పెట్టుకున్నా.. ఏం పర్లేదు.. అవే తగ్గిపోతాయంటూ కూతురి చేత రోజూ స్కిప్పింగ్ ఆడించేది. ఆడడాని బద్దకించి సాకులు చెబుతుందని తల్లి భావించేది.

యువాన్యువాన్ అనే ఈ అమ్మాయి ఎత్తు 1.58 మీటర్లు. బరువు దాదాపు 120 కిలోలు. ఇలాంటి పరిస్థితుల్లో రోజూ వ్యాయామం చేస్తూ పెరిగిన బరువును తగ్గించుకుని ఎత్తును పెంచే ప్రయత్నంలో ఉంది తల్లి. ఇందుకోసం తల్లి ఏ డాక్టర్‌ను సంప్రదించకుండా, విన్నది నమ్మి కూతురు వ్యాయామ షెడ్యూల్‌ను తయారు చేసింది. మొదట్లో కూతురి చేత 1000 సార్లు స్కిప్పింగ్ చేయించేది. ఆ తరువాత పెంచుకుంటూ 3000 స్కిప్‌లు చేసే వరకు ఊరుకునేది కాదు.

3 నెలలుగా, బాలిక తన తల్లి పెడుతున్న ఈ హింసను భరించింది. యువాన్యువాన్ మోకాళ్ల నొప్పులు ఎక్కువగా వస్తున్నాయని వైద్యుని వద్దకు తీసుకెళ్లమని చెప్పింది. దాంతో తల్లి ఆమెను వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా, బాలికకు ట్రాక్షన్ అపోఫిసిటిస్ వచ్చిందని వైద్యులు వివరించారు. బాలికను పరీక్షించిన తర్వాత, అధిక వ్యాయామం పిల్లలకు హానికరం అని డాక్టర్ తల్లికి తెలియజెప్పారు. బరువు తగ్గడానికి ఇతర పద్ధతులను వివరిస్తూ, ఏదైనా ఎక్కువగా చేస్తే అనర్ధానికి దారి తీస్తుందని చెప్పారు.

గతంలో కూడా ఓసారి చైనాకు చెందిన 10 ఏళ్ల బాలుడు ఇలాగే అధిక వ్యాయామాలు చేసి చీలమండల నొప్పి గురించి ఫిర్యాదు చేశాడు. పిల్లలకు వ్యాయామంతో పాటు నిద్ర, పోషకాహారం, మానసిక స్థితి వంటి అంశాలపై కూడా తల్లిదండ్రులు దృష్టి సారించాలని వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు.

Next Story

RELATED STORIES