Rishi Sunak: ఓ హిందువుగా వచ్చా..

Rishi Sunak: ఓ హిందువుగా వచ్చా..
కేంబ్రిడ్జి యూనివర్సిటీలో రామ కథ వినేందుకు వచ్చిన ప్రధాని రిషి

బ్రిటీష్ ప్రధాని రిషి సునక్ కేంబ్రిడ్జి యూనివర్సిటీ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన రామ్ కథ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాను బ్రిటీష్ ప్రధానిగా కాకుండా ఓ హిందువుగా రామ్ కథా కార్యక్రమానికి వచ్చానని ప్రకటించిన రిషి సునక్ తాను హిందువునని, తన విశ్వాసం వ్యక్తిగతమని, మతం తన జీవితంలోని ప్రతీ అంశంలో మార్గనిర్దేశం చేస్తుందని చెప్పారు. ఆధ్యాత్మిక బోధకుడు మొరారీ బాపు రామ్ కథ కార్యక్రమంలో రిషి పాల్గొన్నారు.

రిషి సునాక్ కు పంజాబీ మూలాలున్నాయి. బ్రిటన్‌కు ప్రధానిగా ఉన్న తొలి శ్వేతజాతీయేతర వ్యక్తిగా పేరు పొందారు. తాను హిందువునని ఆయన అవకాశం ఉన్న ప్రతి సమయంలోనూ బహిరంగంగానే ప్రకటించారు. కాగా, ప్రధాని రిషికి మురారీ బాపు గౌరవగా, సాదర స్వాగతం పలికారు. ఓ సాధారణ వ్యక్తిగా ఇక్కడికొచ్చిన మీకు ఘన స్వాగతం అని పలుకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని రిషి సునాక్ హిందూమత విశ్వాసాలు తన జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయని, ప్రధానిగా వీలైనంత మెరుగ్గా పనిచేసేందుకు ప్రోత్సహిస్తాయని తెలిపారు.

ఇక, ప్రవచనం వేదికపై ఏర్పాటు చేసిన హనుమంతుడి పోస్టర్‌ను చూసిన రిషి సునాక్, తన అధికారిక కార్యాలయంలోని టేబుల్‌పై కూడా గణేశుడి విగ్రహం ఉందని చెప్పారు. ఏదన్నా పని చేసే ముందు జాగ్రత్తగా పరిశీలించాలన్న విషయాన్ని తనకు ఆ రూపం ప్రతిసారీ జ్ఞాపకం చేస్తుంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రిషి తన బాల్యం నుంచి కొన్ని జ్ఞాపకాలను పంచుకున్నారు. చిన్నతనంలో తాను తరచూ సౌతాప్టన్ లోని గుడికి వెళ్లిన విషయాలు,తన కుటుంబం చేసే పూజలు, హోమాలు, భక్తులకు తను, తన సోదరులతో కలిసి ఇచ్చే తీర్థ ప్రసాదాల గురించి కూడా చెప్పుకోచ్చారు. తను చేసే ప్రతి పనిలోని శ్రీ రాముడు తనకు స్ఫూర్తిదాయకంగా నిలబడతాడు అన్న నమ్మకంతో ఇక్కడి నుంచి వెళుతున్నన్నారు.

Tags

Read MoreRead Less
Next Story