Omicron variant Symptoms : ఒమిక్రాన్ కొత్త లక్షణాలు ఇవే .. రాత్రుల్లో విపరీతమైన

Omicron variant Symptoms : ఒమిక్రాన్ కొత్త లక్షణాలు ఇవే .. రాత్రుల్లో విపరీతమైన
Omicron variant Symptoms : ఇప్పుడు ప్రపంచ దేశాలను ఒమిక్రాన్‌ వేరియంట్‌ వణికిస్తోంది. డెల్టా వేరియంట్‌ కంటే ఈ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోంది.

Omicron variant Symptoms : ఇప్పుడు ప్రపంచ దేశాలను ఒమిక్రాన్‌ వేరియంట్‌ వణికిస్తోంది. డెల్టా వేరియంట్‌ కంటే ఈ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తోంది. ప్రస్తుతానికి ఈ కొత్త వేరియంట్ 63 దేశాలలో వ్యాపించింది. అయితే ఒమిక్రాన్‌ వ్యాధి తీవ్రత, లక్షణాలపై స్పష్టమైన సమాచారం మాత్రం ఇప్పటివరకు రాలేదు.

అయితే ఒమిక్రాన్‌ సోకిన వారిలో రాత్రిళ్లు విపరీతమైన చెమటతో బాధపడుతున్నారని దక్షిణాఫ్రికాకు చెందిన ఓ డాక్టర్‌ వెల్లడించారు. అయితే అవి స్వల్పంగానే ఉన్నాయని అన్నారు. కరోనా లక్షణాలైన దగ్గు, ముక్కు కారడం, గొంతు నొప్పి, తీవ్రమైన జ్వరం వంటివి కొత్త వేరియంట్‌ బాధితుల్లో లేవని ఆయన అన్నారు.

ఒమిక్రాన్‌ సోకిన బాధితుల్లో తీవ్రమైన తలనొప్పి, ఒళ్లునొప్పులు, స్వల్ప జ్వరం, అలసట, గొంతులో దురదతో బాధపడుతున్నారని తెలిపారు. అయితే టీకాలు తీసుకొని వారిలో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పుకొచ్చారు. అయితే డెల్టా సోకిన వారు వాసన కోల్పోగా.. ఒమిక్రాన్‌ సోకిన బాధితుల్లో ఆ లక్షణం కన్పించట్లేదని ఆయన తెలిపారు.

కాగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ దక్షిణాఫ్రికాలో బయటపడిన సంగతి తెలిసిందే.. కానీ మందులతో ఈ వేరియంట్‌ నుంచి కోలుకుంటున్నట్లుగా వైద్యులు చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story