Shahid Latif: పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారి హత్య

Shahid Latif: పఠాన్ కోట్ ఉగ్రదాడి సూత్రధారి  హత్య
సియాల్‌కోట్‌లో కాల్చి చంపిన గుర్తు తెలియని దుండగులు

దాదాపు ఎనిమిదేళ్లక్రితం జరిగిన పఠాన్ కోట్ ఉగ్రదాడి కుట్రదారుల్లో కీలక సూత్రధారి, నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ తీవ్రవాది షాహీద్ లతీఫ్ పాకిస్తాన్‌లో హత్యకు గురయినట్టుగా తెలుస్తోంది. బుధవారం పాక్‌లోని సియోల్‌కోట్‌లో గుర్తుతెలియని దుండగులు అతని తుపాకీతో కాల్చిచంపారు. పఠాన్ కోట్ దాడి అనంతరం షాహీద్ లతీఫ్ భారత్‌కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్నాడు. పఠాన్ కోట్ దాడిని సియోల్‌కోట్ నుంచి నడిపించాడు. దాడి చేసేందుకు నలుగురు ఉగ్రవాదులను పంపించాడు. దాడి చేసేందుకు భారత భూభాగంలోకి చొరబడిన ఉగ్రవాదుల సూత్రధారులు, హ్యాండ్లర్లు పాకిస్థాన్‌లోనే ఉన్నారని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది.

కాగా.. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద 1994 నవంబర్‌లోనే లతీఫ్‌ను భారత్ అరెస్ట్ చేసింది. న్యాయస్థానాల ముందు నిలబెట్టగా అతడికి జైలుశిక్ష కూడా పడింది. జైలు జీవితం పూర్తయిన తర్వాత 2010లో వాఘా సరిహద్దు ద్వారా అతడిని పాకిస్తాన్‌కు పంపించేశారు. అంతేకాదు.. 1999లో ఇండియన్ ఎయిర్‌‌లైన్స్ విమానం హైజాకింగ్ ఘటనలో కూడా లతీఫ్ నిందితుడిగా ఉన్నాడు. కాగా.. 2010లో జైలు శిక్ష అనంతరం పాకిస్తాన్ వెళ్లాక మళ్లీ అతడు ఉగ్రవాదుల్లో కలిశాడని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) తెలిపింది. భారత ప్రభుత్వం అతడిని మోస్ట్ వాంటెడ్ వ్యక్తుల జాబితాలో చేర్చిందని అన్నారు.

షాహిద్ తాలిఫ్ పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని గుజ్రాన్‌వాలా నివాసి. అతను జైషే మహ్మద్‌తో సంబంధం కలిగి ఉన్నాడు. అంతకుముందు షాహిద్ లతీఫ్ నవంబర్ 12, 1994 న అరెస్టు చేయబడ్డాడు మరియు 16 సంవత్సరాలు భారతీయ జైళ్లలో శిక్ష అనుభవించిన తర్వాత 2010లో బయటకు వచ్చాడు. 2016 జనవరి 2న పఠాన్‌కోట్‌లో జరిగిన దాడికి షాహిద్ లతీఫ్ సూత్రధారి. ఇది కాకుండా, ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన కేసులో కూడా షాహిద్ నిందితుడిగా ఉన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story