professional queuers: భలే ఉద్యోగం బాసూ.. 8 గంటలు క్యూ లో నిలబడితే రూ.16,000
professional queuers: క్యూలో నిలబడలేని వ్యక్తుల కోసం ఒక పరిష్కార మార్గం ఇక్కడ కనుగొనబడింది.. ఉద్యోగం లేని వ్యక్తులకు ఉపాధి దొరికింది..

professional queuers: బతకాలంటే బోలెడు మార్గాలు.. ఎవరి దగ్గరా చేయి చాచకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి.. కాళ్లు నొప్పెడుతున్నాయి.. నా కోసం ఎవరైనా క్యూలో నిలబడి ఆ టికెట్లేవో తెచ్చిస్తే బావుండు అని చాలా మంది అనుకుంటారు.. కానీ ఎవరు చేస్తారు.. ఎవరికంత టైమ్ ఉంది.. ఎవరి బిజీ వారిది.. క్యూలో నిలబడడమే ఓ ఫ్రోఫెషన్ అయి దానిక్కూడా ఛార్జ్ చేస్తే నిలబడతారు మరి.. ఇలాంటి వ్యక్తులు మన ఇండియాలో కాదుగానీ లండన్‌లో కనిపిస్తారు.. వాళ్లని ప్రొఫెషనల్ క్యూయర్స్ అంటారు..
క్యూలో నిలబడటం అనేది బ్రిటిష్ వారికి ప్రసిద్ధి చెందిన విషయం. క్యూలో నిలబడలేని వ్యక్తుల కోసం ఒక పరిష్కార మార్గం ఇక్కడ కనుగొనబడింది.. ఉద్యోగం లేని వ్యక్తులకు ఉపాధి దొరికింది..
మీ కోసం ఫ్లాట్ ప్యాక్ ఫర్నీచర్‌ను ఉంచడానికి, పనులను నిర్వహించడానికి మరియు మీ షాపింగ్‌ను ఒక క్లిక్‌తో లేదా వేలితో నొక్కడానికి మీరు ఎవరినైనా కనుగొనగలిగే సమయంలో, మీరు ఇప్పుడు మీ కోసం క్యూలో నిలబడటానికి ఒకరిని నియమించుకోవచ్చు.
సినిమా టికెట్లు కావచ్చు, షాపింగ్ మాల్‌లో బిల్ పే చేసేటప్పుడు కావచ్చు.. ఏదైనా ప్రొడక్ట్ ఆ ఒక్కరోజే సేల్ అన్నప్పుడు కావచ్చు.. ఇలా దేనికి సంబంధించినదైనా క్యూలో నిలబడాలంటే చాలా మందికి చాలా కష్టం.. అలాంటి వారికోసమే క్యూయర్స్ ఉంటారు. మీకు పనీ అవుతుంది.. వాళ్లకు డబ్బులూ వస్తాయి.. అయితే గంట నిలబడితే రూ.2000 ఛార్జ్ చేస్తారు మన కరెన్సీలో అలా.. రోజుకు 8 గంటలకు క్యూలో నిలబడి రూ.16,000 సంపాదించేవారు కూడా ఉన్నారు. వీరి కోసం ఓ వెబ్‌సైట్ కూడా ఉంది. ఇక ఇందులో పేరు నమోదు చేసుకున్న వ్యక్తులు క్యూయర్‌లుగా మాత్రమే కాదు పెట్ సిట్టింగ్ నుండి బేకింగ్ వరకు అన్ని రకాల సేవలను అందిస్తారు.
ఎకానమీ విస్తరిస్తున్నప్పుడు మరియు సౌలభ్యం కోసం చెల్లించడానికి ఇష్టపడే కొంతమంది లండన్ వాసులు ఈ విధంగా ఆలోచించడంలో తప్పులేదు.
RELATED STORIES
sattu sharbat: సమ్మర్ లో సత్తు షర్బత్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
18 May 2022 8:41 AM GMTKidney Stones: ఎండాకాలంలో కిడ్నీలో రాళ్లు ఎందుకు పెరుగుతాయి? డాక్టర్స్ ...
16 May 2022 7:45 AM GMTHealthy Spine: మహిళలను వేధించే వెన్నునొప్పి.. నివారణ మార్గాలు..
14 May 2022 5:30 AM GMTPre-Wedding Diet Plan: ట్రెండ్ మారింది.. తెరపైకి ప్రీ వెడ్డింగ్ డైట్...
13 May 2022 10:30 AM GMTOatmeal Diet: బరువు తగ్గడానికి ఓట్ మీల్ డైట్.. 7 రోజులు ఇలా చేస్తే..
12 May 2022 7:30 AM GMTUrinary Tract Infections: యూరినరీ ఇన్ఫెక్షన్స్ తో ఇబ్బంది పడుతుంటే ఇలా ...
10 May 2022 5:30 AM GMT