America: మాజీ మెకానిక్ జాక్‌పాట్.. లాటరీలో రూ.328 కోట్లు

America: మాజీ మెకానిక్ జాక్‌పాట్.. లాటరీలో రూ.328 కోట్లు
America: జీవితం మొత్తం కష్టపడ్డా కోటి రూపాయలు సంపాదించలేని పరిస్థితి. కానీ లాటరీలో ఒక కోటి కాదు ఏకంగా రూ.328 కోట్లు గెలుచుకున్నాడు.

America: జీవితం మొత్తం కష్టపడ్డా కోటి రూపాయలు సంపాదించలేని పరిస్థితి. కానీ లాటరీలో ఒక కోటి కాదు ఏకంగా రూ.328 కోట్లు గెలుచుకున్నాడు. స్నేహితుడు చెబితే ఏప్రిల్ ఫూల్ చేస్తున్నాడేమో అని కొట్టి పారేశాడు. ఎందుకంటే ఆ లాటరీ టికెట్ కొన్నది ఏప్రిల్ 1న.. అందుకే అతడికి డౌట్ వచ్చింది. ఏప్రిల్ పూల్ కాదురా బాబు నిజంగానే లాటరీ తగిలింది అని అతడిని ఒప్పించడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది స్నేహితుడికి. టికెట్ తీసుకుని షాపుకి వెళ్లి కన్ఫామ్ చేసుకున్నాక కానీ తాను 40 మిలియన్ డాలర్లు గెలుచుకున్నాననే విషయాన్ని నమ్మలేకపోయాడు.

అమెరికాలోని అయోవాలోని డబుక్ సిటీకి చెందిన 61 ఏళ్ల లాపీ మెకానిక్‌గా పనిచేసి రిటైరయ్యారు. తాజాగా ఆయన కొనుగోలు చేసిన 'లోట్టో అమెరికా' లాటరీ టిక్కెట్‌కు జాక్‌పాట్‌ తగిలింది. అతని ఆనందానికి అవధులు లేవు. సోమవారం లాటరీ ప్రధాన కార్యాలయానికి వచ్చి టికెట్‌ తీసుకున్నాడు. 29 ఏళ్ల వ్యవధిలో విడతల వారీగా రూ.328 కోట్లు ఇస్తామన్నారు లాటరీ యాజమాన్యం. మొత్తం ఒకేసారి తీసుకోవాలుకుంటే అంత రాదు అని చెప్పారు. కానీ అతడు ఏకమొత్తంలో తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతనికి రూ.175 కోట్ల నగదు బహుమతి లభించనుంది. ఇప్పటికే 61 ఏళ్లు వచ్చేశాయి. ఇంకెంత కాలం ఉంటామో తెలియదు.. ఉన్నన్నాళ్లయినా ఏలోటూ లేకుండా హాయిగా ఉండొచ్చనుకున్నాడు.. అందుకే తక్కువ వచ్చినా ఒకేసారి రూ.175 కోట్లు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతడి అభిప్రాయాన్ని కుటుంబసభ్యులు, స్నేహితులు కూడా సమర్థించారు.

Tags

Read MoreRead Less
Next Story