అగ్ని కీలల్లో చిక్కుకున్న ఆస్పత్రి.. అదే సమయంలో ఆపరేషన్ థియేటర్‌లో హార్ట్ సర్జరీ

అగ్ని కీలల్లో చిక్కుకున్న ఆస్పత్రి.. అదే సమయంలో ఆపరేషన్ థియేటర్‌లో హార్ట్ సర్జరీ
ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అదే సమయంలో థియేటర్లో హార్ట్ సర్జరీ నిర్వహిస్తున్నారు ఎనిమిది మంది వైద్యులు.

పక్కింట్లో నుంచి పొగలు వస్తున్నా అగ్నిప్రమాదమేమోనని ఉన్న ఫళంగా మనం కూడా బయటకు పరుగుపెడతాం.. ఎక్కడివక్కడ వదిలేసి బతుకు జీవుడా అనుకుంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అగ్ని కీలల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాం. బతికి బాగుంటే బలుసాకైనా తినొచ్చని తొందరపడతారంతా. అలాంటిది ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

అదే సమయంలో థియేటర్లో హార్ట్ సర్జరీ నిర్వహిస్తున్నారు ఎనిమిది మంది వైద్యులు. ఏ చిన్న ఇబ్బంది తలెత్తినా పేషెంట్‌కి ఎంతో ప్రమాదం. మరో పక్క శస్త్రచికిత్స చేస్తున్న వైద్యుల ప్రాణాలకీ ప్రమాదం. అయినా డాక్టర్లు ప్రాణ త్యాగానికి సిద్దపడ్డారు. పేషెంట్ ప్రాణాలు కాపాడాలనుకున్నారు. దేవుడి మీద భారం వేశారు. శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

1907లో నిర్మించిన పురాతన ఆసుపత్రి బ్లేగోవెష్చెన్స్క్ రష్యాలో ఉంది. ఈ ఆస్పత్రిలో శుక్రవారం మంటలు చెలరేగాయి. విషయం తెలిసిన వెంటనే అగ్నిప్రమాద యంత్రాంగం అప్రమత్తమయ్యారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 120 మంది పేషెంట్లను క్షేమంగా బయటకు తరలించారు. అదే సమయంలో హాస్పిటల్ గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఓ వ్యక్తికి గుండె ఆపరేషన్ నిర్వహిస్తున్నారు వైద్యులు. దాదపు 8 మంది వైద్యులు ఆపరేషన్ థియేటర్‌లో ఉన్నారు.

సిబ్బంది వైద్యులకు అగ్నిప్రమాద సమాచారాన్ని అందించారు. అయినా ఏ మాత్రం భయపడకుండా చేస్తున్న చికిత్స పట్ల మరింత శ్రద్ధ వహించి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేశారు. అగ్రిప్రమాదం సంభవిచడంతో ఆస్పత్రిలో పవర్ కనెక్షన్ కట్ చేశారు. కానీ ఆపరేషన్ చేస్తున్న థియేటర్‌కి మాత్రం ప్రత్యేక పద్దతిలో పవర్ సరఫరా జరిగేటట్లు చూశారు. ఇక ప్రమాదం వల్ల ఆపరేషన్ థియేటర్‌లోక పొగ చేరడంతో అప్పటికప్పుడు దాన్ని బయటకు పంపించే అధునాతన పరికరాలను ఏర్పాటు చేశారు.

ఎలాంటి ఆటంకం జరగకుండా చూసుకుని ఆపరేషన్ సక్సెస్‌ఫుల్‌గా జరిగేలా చూశారు. అనంతరం పేషెంట్‌ని మరో ఆస్పత్రికి తరలించారు. ప్రాణాలు ఫణంగా పెట్టి వృత్తి ధర్మాన్ని నిర్వర్తించిన డాక్టర్లకు పేషెంట్ కుటుంబసభ్యులు కృతజ్ఞత తెలిపారు. వైద్యులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ వైద్యుడు మాట్లాడుతూ.. ఇందులో మా గొప్పతనం ఏమీ లేదు.. మా విధులు మేం నిర్వర్తించాం. కాకపోతే ఇది కాస్త రిస్కీ ఆపరేషన్. అదృష్టం కొద్దీ మాతో పాటు పేసెంట్ ప్రాణాల్ని కూడా కాపాడగలిగాం అని అన్నారు. ప్రమాద దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Tags

Read MoreRead Less
Next Story