రూ.52 వేల కోట్ల భరణం కావాలంట.. కోర్టుకెక్కిన బిలియనీర్ భార్య

రూ.52 వేల కోట్ల భరణం కావాలంట.. కోర్టుకెక్కిన బిలియనీర్ భార్య
దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో చోటు సంపాదించుకున్న వ్లాదిమర్ పొటానిన్‌ది రెండో స్థానం.

ఎనుగు చచ్చినా బతికినా లక్షే అన్న సామెత ఊరికే రాలేదేమో.. ఇలాంటివి చూస్తే అలానే అనిపిస్తుంది మరి.. బిలియనీర్ భార్య అంటే ఆ మాత్రం ఉండాలి.. తగ్గేదేలేదు అంటోంది రష్యాలోని సంపన్న కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి భార్య. దేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో చోటు సంపాదించుకున్న వ్లాదిమర్ పొటానిన్‌ది రెండో స్థానం.

ఆయన తన భార్య నటాలియాతో 31 ఏళ్లు కాపురం చేశారు. సుదీర్ఘ బంధం బీటలు వారింది విడాకులు తీసుకోవాలనుకున్నారు. ఇందు కోసం కోర్టును ఆశ్రయించారు. వ్లాదిమర్ దగ్గర బోల్డంత ఆస్తి ఉంది. అందులో నుంచి జస్ట్ రూ.52 వేల కోట్లు ఇప్పించండి చాలు అని నటాలియా కోర్టు వారిని కోరింది. విడాకుల సమయంలోనే కొంత ముట్ట జెప్పినా వ్లాదిమర్‌కు ఉన్న ఆస్తుల్లో 50% వాటా కావాలని ఆమె కోర్టు వారికి మరోసారి విన్నవించుకుంది.

గతంలోనూ భారీ మొత్తంలో భార్యలకు భరణం ఇచ్చిన కేసులు లండన్‌లో చాలా ఉన్నాయి. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ తన మాజీ భార్యకు రూ.2.7 లక్షల కోట్లు ఇవ్వగా, మైక్రోసాప్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ రూ.1.96 లక్షల కోట్లు ఇచ్చారు. వారి తరువాతి స్థానాల్లో అత్యధిక భరణం ఇవ్వనున్న వ్యక్తిగా వ్లాదిమర్ పేరు వినిపిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story