Russia : ఈసారి నౌకాశ్రయంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి

Russia : ఈసారి నౌకాశ్రయంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడి
ఉక్రెయిన్‌ దెబ్బకి పచ్చడై పోయిన రష్యా యుద్ధ నౌక

గత కొంత కాలంగా రష్యా పై ప్రతిదాడులను ఉద్ధృతం చేసిన ఉక్రెయిన్‌ ఇప్పుడు ఓ ఓడరేవుపై దాడికి దిగింది. ఈ దాడిలో రష్యా ల్యాండింగ్‌ షిప్‌ దారుణంగా దెబ్బతింది. దీంతో రష్యాకు కీలకంగా ఉన్న ఈ ఓడరేవులో కార్యకలాపాలను నిలిపివేసినట్లు కాస్పియన్ పైప్‌లైన్ కన్సార్టియం తెలిపింది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ ఇంటర్నెట్లో వైరలయ్యాయి.

కొన్నిరోజుల నుంచి రష్యాపై డ్రోన్లతో విరుచుకపడుతున్న ఉక్రెయిన్‌ దాడులను మరింత ఉద్ధృతం చేసింది. నిరంతరాయంగా కొనసాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ రష్యాను చావుదెబ్బ తీసింది. ప్రపంచ దేశాలకు చమురు తోపాటు ధాన్యాన్ని సరఫరా చేసే రష్యా నల్ల సముద్ర నౌకాదళ స్థావరంపై ఉక్రేనియన్ డ్రోన్ దాడి చేసింది.

ఈ ఘటనలో ఒలెనెగోర్స్కీ గోర్న్యాక్ అనే యుద్ధ నౌక తీవ్రస్థాయిలో దెబ్బతింది. డ్రోన్ల ద్వారా సుమారు 450 కిలోల టీఎన్‌టీని మోసుకెళ్లి ఓడను ఢీకొట్టినట్లు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ వర్గాలుప్రకటించాయి. దాడి సమయంలో యుద్ధనౌకపై సుమారు 100 మంది రష్యా సాయుధులు ఉండి ఉంటారని అంచనా వేస్తున్నారు. దాడితో రష్యా యుద్ధనౌక తీవ్రంగా దెబ్బతినటంతోపాటు పనిచేయలేని స్థితికి చేరిందని ఉక్రెయిన్‌ సైనికవర్గాలు వెల్లడించాయి. రాత్రిపూట జరిగినా కూడా డ్రోన్ కెమెరాలో దాడికి సంబంధించిన దృశ్యాలు క్లియర్ గా కనిపించాయి. ఈ వీడియోను ఉక్రెయిన్ బలగాలు మీడియాకు చేరవేశాయి.

రష్యాలో సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌ నౌకాశ్రయం తర్వాత ఇది రెండో అతిపెద్ద వాణిజ్య ఓడరేవు. ఈ నౌకాశ్రయంపై జరిగే దాడులను ఎదుర్కొనేందుకు రష్యా....రెండు యుద్ధ నౌకలను మోహరించింది. ఉక్రెయిన్‌ డ్రోన్లను కూల్చడమే లక్ష్యంగా మోహరించిన ఈ నౌకలపై రెండు శతఘ్నులు కూడా ఉన్నాయి. శుక్రవారం తెల్లవారుజామున రెండు మానవరహిత డ్రోన్లు నోవోరోసిస్క్‌ ఓడరేవుపై దాడులు చేశాయని రష్యా ధ్రువీకరించింది. ఈ దాడులను తిప్పికొట్టినట్లు వెల్లడించింది. దాడి వల్ల ఎలాంటి నష్టం వాటిల్లలేదని ప్రకతించింది.

మరోవైపు ఉక్రెయిన్ రిటైర్డ్ నావికా దళాధిపతి మాట్లాడుతూ ఈ దాడుల కోసం ఉక్రెయిన్ సముద్ర డ్రోన్లు దాదాపు 760 కిలోమీటర్లు ప్రయాణించి ఉంటాయని. ఉక్రెయిన్ డ్రోన్లు అంత దూరం ప్రయాణించడం ఇదే మొదటిసారని ఆయన అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story