FIRE BLAZED: నడి సంద్రంలో తగలబడుతున్న మూడు వేల కార్లు

FIRE BLAZED: నడి సంద్రంలో తగలబడుతున్న మూడు వేల కార్లు
నడి సంద్రంలో అగ్నికి ఆహుతవుతున్న మూడు వేల కార్లు... నౌకలో అందరూ భారత సిబ్బందే... ఇప్పటికే సిబ్బందిలో ఒకరు మృతి...

నడి సంద్రంలో వేల కార్లను తరలిస్తున్న నౌకలో అగ్ని ప్రమాదం( fire blazed) సంభవించింది. ఈ ప్రమాదంలో వేల కార్లు అగ్నికి ఆహుతవుతున్నాయి(cars ablaze ). జపాన్‌కు చెందిన షూయ్ కిసెన్ నౌకలోని మొత్తం 21 మంది సిబ్బంది భారతీయులేనని(ntire crew of 21 was Indian) నౌకా సిబ్బంది వెల్లడించారు. నౌకలో విధులు నిర్వహిస్తున్న భారత నౌక సిబ్బంది ఒకరు మరణించగా( killing one member of the crew) మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు( injuring several). మంటలను ఆర్పేందుకు హెలికాఫ్టర్లను రంగంలోకి దింపారు.


నెదర్లాండ్స్‌(Dutch coast )లోని ఉత్తర సముద్రంలో సరుకు రవాణా చేసే ఒక నౌకలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ మంటల్లో నౌకలో ఉన్న 3 వేల కార్లు దగ్ధమవుతున్నాయి. జర్మనీ నుంచి ఈజిప్ట్‌నకు దాదాపు 3 వేల కార్ల( 3,000 cars)తో బయల్దేరిన రవాణానౌక నెదర్లాండ్స్‌ తీరంలో మంటల్లో చిక్కుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా, 23 మంది సిబ్బంది సముద్రంలోకి దూకి ప్రాణాలను రక్షించుకున్నారు. ఎముకలు విరిగి, ఒళ్లు కాలి, శ్వాస తీసుకోలేక ఇబ్బందిపడుతున్న వీరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నౌకలోని 25 ఎలక్ట్రిక్‌ కార్లలో ఒకదానికి నిప్పంటుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. మంటలు మిగతా కార్లనూ దగ్ధం చేస్తున్నాయి. రోజులు తరబడి ఈ మంటలు కొనసాగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.


జర్మనీలోని బ్రెమర్‌హెవన్‌ పోర్టు నుంచి ఈజిప్టులో మరో పోర్టుకి ఈ నౌక వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ నౌకలో దట్టంగా పొగ అలుముకోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి 22 మంది నౌకా సిబ్బందిని ఆస్పత్రికి తరలించినట్టుగా డచ్‌ కోస్ట్‌గార్డ్‌ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. నౌకకి ఇరువైపులా నీళ్లు పోస్తూ( ships sprayed water) మంటల్ని అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోపల నీళ్లు వేస్తే నౌక మునిగిపోయే ప్రమాదం ఉందన్న( much water risked its sinking) ఆందోళనలున్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనాలు తరలించడం కూడా ఒక ముప్పుగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అగ్నిప్రమాదంలో భారత నావికుడు మరణించాడని, మరికొందరు సిబ్బందికి గాయాలయ్యాయని నెదర్లాండ్స్‌లోని భారత రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. మరణించిన సిబ్బంది వారి కుటుంబ సభ్యులకు విషయాన్ని చెప్పామని వెల్లడించింది.


చెప్పారు. రెస్క్యూ షిప్‌లు నౌకలోని మంటలను ఆర్పేందుకు నీటిని వెదజల్లుతున్నాయని అధికారులు తెలిపారు. ఎక్కువ నీటిని ఉపయోగిస్తే నౌక మునిగిపోయే ప్రమాదం ఉందని డచ్ కోస్ట్‌గార్డ్ తెలిపింది. మంటలను ఆర్పడం చాలా కష్టమని స్పష్టం చేసింది. ఓడలోని మొత్తం 2,857 వాహనాల్లో దాదాపు 25 ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయని వెల్లడించింది.

Tags

Read MoreRead Less
Next Story