పాము విషం రూ.13 కోట్లు.. మేడిన్ ఫ్రాన్స్

పాము విషం రూ.13 కోట్లు.. మేడిన్ ఫ్రాన్స్
ఇండో బంగ్లాదేశ్ సరిహద్దులో పశ్చిమ బెంగాల్ నుండి రూ. 13 కోట్ల విలువైన పాము విషాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు స్వాథీనం చేసుకున్నారు.

ఇండో బంగ్లాదేశ్ సరిహద్దులో పశ్చిమ బెంగాల్ నుండి రూ. 13 కోట్ల విలువైన పాము విషాన్ని బీఎస్ఎఫ్ జవాన్లు స్వాథీనం చేసుకున్నారు. దేశంలోకి అక్రమంగా తరలిస్తున్న కోట్ల రూపాయల విలువైన పాము విషాన్ని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) స్వాధీనం చేసుకుంది. బంగ్లాదేశ్‌కు చెందిన ఇద్దరు స్మగ్లర్లు రూ.13 కోట్ల విలువైన పాము విషంతో అక్రమంగా సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించారు. దీనిపై బీఎస్ఎఫ్ బలగాలకు సమాచారం అందించి నిఘా పెట్టారు. పశ్చిమ బెంగాల్‌ హిలి ప్రాంతంలోని పహన్‌పరా గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత ఇద్దరు స్మగ్లర్లు అక్రమంగా దేశంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. బీఎస్ఎఫ్ జవాన్లు వారిపై కాల్పులు జరపగా స్మగ్లర్లు అక్కడి నుంచి తప్పించుకున్నారు.

స్మగ్లర్లు తమ వెంట తెచ్చుకున్న సరుకులను ఆ ప్రాంతంలోనే వదిలేశారు. దీంతో బీఎస్ఎఫ్ జవాన్లు అక్కడ తనిఖీలు నిర్వహించగా స్మగ్లర్లు వదిలేసిన సీసా కనిపించింది. దానిని పరిశీలించగా అందులో పాము విషం ఉన్నట్లు తేలింది. బాటిల్‌పై 'మేడ్ ఇన్ ఫ్రాన్స్' అని రాసి ఉందని బీఎస్‌ఎఫ్ అధికారులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ పాము విషం విలువ కనీసం రూ.13 కోట్లు ఉంటుందని చెబుతున్నారు.

స్మగ్లర్లిద్దరూ తప్పించుకున్నారని, ఇందుకు సంబంధించి ఎవరినీ అరెస్టు చేయలేదని వివరించారు. సీసాలో విషం కింగ్ కోబ్రా.. బాటిల్ ను బాలూర్ ఘాట్ అటవీ అధికారులకు అప్పగించారు. అయితే, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో అక్రమంగా పాము విషాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడటం మొదటిసారి కాదు. అంతకుముందు బెంగాల్ సరిహద్దులో బీఎస్ఎఫ్ బలగాలు రూ.57 కోట్ల విలువైన పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నాయి.

సెప్టెంబర్ 2021లో, దక్షిణ దినాజ్‌పూర్‌లోని డోంగి గ్రామంలో 56 ఔన్సుల విషంతో కూడిన బాటిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ బాటిల్‌లో 'మేడ్ ఇన్ ఫ్రాన్స్.. కోడ్ నెం. 6097' అని వ్రాయబడింది. అలాగే గతేడాది సెప్టెంబర్‌లో నార్త్ దినాజ్‌పూర్‌లో రూ.30 కోట్ల విలువైన రెండు కిలోల పాము విషాన్ని స్వాధీనం చేసుకున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఫ్రాన్స్ నుంచి బంగ్లాదేశ్ కు, అక్కడి నుంచి నేపాల్, భారత్ మీదుగా చైనాకు తీసుకురావడమే స్మగ్లర్ల ప్రధాన ఉద్దేశమని తెలుస్తోంది. సాంప్రదాయ ఔషధాలను తయారు చేయడానికి చైనీయులు పాము విషాన్ని ఉపయోగిస్తారు. పాము విషం నుండి ప్రాణాంతక వ్యాధులకు మందులు కనుగొనడం పురాతన కాలం నుండి ఉంది. ఆయుర్వేదంలో కీళ్ల నొప్పులకు పాము విషంతో తయారైన మందులను ఉపయోగిస్తారు. ఆ పాము విషం ఖరీదు రూ.250 కోట్లు.

Tags

Read MoreRead Less
Next Story