America: అమెరికాలో మంచు తుపాను బీభత్సం.. మృతి చెందిన తెలుగు దంపతులు

America: అమెరికాలో మంచు తుపాను బీభత్సం.. మృతి చెందిన తెలుగు దంపతులు
America: అమెరికాలో తీవ్ర విషాదం నెలకొంది. మంచు బీభత్సంలో ముగ్గురు తెలుగు వాళ్లు మృతి చెందారు.

America: అమెరికాలో తీవ్ర విషాదం నెలకొంది. మంచు బీభత్సంలో ముగ్గురు తెలుగు వాళ్లు మృతి చెందారు. అరిజోనాలో ఈ ఘటన జరిగింది. గడ్డకట్టిన సరస్సు వద్ద ఫొటోలు దిగుతుండగా.. నారాయణ, హరిత దంపతులు సహా మరొకరు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. హరిత మృతదేహం లభ్యంకాగా ... మిగతా ఇద్దరి మృతదేహాలు కనిపించకుండా పోయాయి. వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మృతులను గుంటూరు జిల్లా పాలపర్రు వాసులుగా గుర్తించారు. ఘటనతో పలపర్రులో విషాద ఛాయలు అలుముకున్నాయి


అరిజోనాలోని ఐస్‌ లేక్‌ దగ్గర ఫొటోలు దిగుతుండగా ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంచు పలకలు మీదపడటంతో నారాయణ, హరిత దంపతులు మంచులో కూరుకుపోయారు. వీరిని రక్షించేందుకు వెళ్లిన గోకుల్ అనే వ్యక్తి కూడా మంచులో కూరుకుపోయారు. ఈ ప్రమాదం నుంచి నారాయణ కూతుళ్లు తృటిలో తప్పించుకున్నారు. గోకుల్ విశాఖకు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.


మరోవైపు అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. మంచు తుపాను దెబ్బకు విలవిలలాడిపోతోంది. అమెరికా సహా కెనడాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తీవ్రమైన చలిగాలులతో ఇప్పటివరకు 60 మంది చనిపోయారు. ఇక నారాయణ, హరిత దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి న్యూజెర్సీ నగరంలో నివాసముంటున్నారు.



విహార యాత్రకు బయలుదేరిన సమయంలో మంచు తుపాను వీరిని కమ్మేసింది. దంపతుల మరణంతో వారి ఇంట్లో తీవ్ర విషాదం అలుముకుంది. మృతదేహాలను స్వస్థలానికి చేర్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు కోరారు.

Tags

Read MoreRead Less
Next Story