CHINA: చైనాను వణికిస్తున్న వర్షాలు

CHINA: చైనాను వణికిస్తున్న వర్షాలు
ఎడతెరపిలేని వర్షంతో నదులను తలపిస్తున్న నగరాలు... హై అలర్ట్ జారీ చేసిన ప్రభుత్వం.. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు...

భారీ వర్షాలు( heavy rains ) చైనా(china )ను అతలాకుతలం చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర చైనా( many parts of north China) ప్రాంతంపై కుంభవృష్టి( triggered danger) కురుస్తోంది. ఎడతెరిపిలేని వర్షాని(heavy rains )కి చైనా రాజధాని బీజింగ్‌(Beijing ) సహా అనేక నగరాల్లో వీధులు నదులను తలపిస్తున్నాయి. హుబే ప్రావిన్సులో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. వరద ఉద్దృతికి అనేక వంతెనలు, రహదారులు తెగిపోయాయి. ముందుగానే రైళ్లను నిలిపివేశారు. వరదల ధాటికి ఇప్పటివరకూ ఇద్దరు చనిపోయారు. ఉవన్‌లో కారులో చిక్కుకుపోయిన వ్యక్తిని అతికష్టంపై సహాయ సిబ్బంది కాపాడారు. సోమవారం మధ్యాహ్నం వరకూ బావోడింగ్ నగరంలో 50 వేల మందిని అధికారులు ఖాళీ చేయించినట్లు జిన్హువా వార్తా సంస్థ తెలిపింది.


చూచౌ, లాంగ్‌ఫాంగ్‌ నగరాలను ఆకస్మిక వరద ముంచెత్తగా అనేక వాహనాలు చిక్కుకుపోయాయి. అగ్నిమాపక దళం రంగంలోకి దిగి వాహనాల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించాయి. ఆదివారం నుంచి కురుస్తున్న వర్షాలు కొనసాగుతుండడంతో ఉత్తర చైనాలోని నగరాలు, పట్టణాల్లో హైఎలర్ట్(High alerts ) ప్రకటించారు. శక్తివంతమైన గాలులు, భారీ వర్షం ధాటికి చైనీయులు వణికిపోతున్నారు.


భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. బస్సులు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అనేక వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. పలు అపార్ట్‌మెంట్‌లు భవనాలలో భారీగా వరద నీరు చేరింది. ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రక్రియకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానికంగా ఉన్న నదిలో నీటి మట్టం విపరీతంగా పెరగడంతో స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


ఇటీవలే చైనా పుజియాన్ ప్రావిన్స్‌లోని అనేక నగరాలను డొక్సురి తుపాను (Doksuri typhoon )వణికించింది. డ్రాగన్‌లోని చాలా నగరాల్లో 300 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా రోడ్లన్ని జలమయం అయ్యాయి. బస్సులు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికంగా ఉన్న నదిలో నీటి మట్టం విపరీతంగా పెరగడంతో స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.1961 తర్వాత పుజియాన్ ప్రావిన్స్‌లో అత్యధిక వర్షపాతం ఇప్పుడే నమోదైందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఫుజియాన్ ప్రావిన్స్‌లో 4 లక్షల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Tags

Read MoreRead Less
Next Story