భారత్- చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తత

X
Nagesh Swarna4 Sep 2020 10:09 AM GMT
భారత్ చైనా సరిహద్దుల్లో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉందన్నారు ఆర్మీ చీఫ్ మనోజ్ కుంద్ నరవణె. దీనికి సంబంధించిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. లేహ్‌లో పర్యటించిన నరవణె తెలిపారు. అయితే చర్చల ద్వారా సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అటు..ప్యాంగ్యాంగ్‌లో మాత్రం చైనా సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. లేహ్ పర్యటనలో సైనిక అధికారులతో కలిసి పరిస్థితిని సమీక్షించినట్టు ఆర్మీ చీఫ్ చెప్పారు. అయితే సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు.. మన సైన్యం సిద్ధంగా ఉందని నవరణె స్పష్టం చేశారు.
Next Story