రూ.270 లకు మూడు ఇళ్లుకొన్న మహిళ.. ఇటుకలు కూడా రావట్లేదే.. అదెలా సాధ్యం..

రూ.270 లకు మూడు ఇళ్లుకొన్న మహిళ.. ఇటుకలు కూడా రావట్లేదే.. అదెలా సాధ్యం..
ఇటలీలో కేవలం రూ. 270కి మూడు ఇళ్లను కొనుగోలు చేసింది ఓ మహిళ. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ..

ఇటలీలో కేవలం రూ. 270కి మూడు ఇళ్లను కొనుగోలు చేసింది ఓ మహిళ. వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ..ఆ రేటుకి ఇటుకలు కూడా రావు ఇల్లు కొనడమేంటి అని అనిపిస్తోంది.. అవును నిజంగా నిజం.. శిథిలావస్థలో ఉన్న మూడు ఇళ్లకు యజమాని ఆమె. ఒక్కో ఇల్లు కేవలం రూ. 89కి కొనుగోలు చేయబడింది.

కాలిఫోర్నియాకు చెందిన 49 ఏళ్ల రుబియా డేనియల్స్, ఇటలీలోని ముస్సోమెలి అనే మనోహరమైన పట్టణంలోకి అడుగు పెట్టి అక్కడి అందాలను ఆస్వాదిస్తోంది. ఆ సమయంలో అక్కడ ఇళ్లు అమ్మకానికి ఉన్నాయని తెలుసుకుంది. శిధిలావస్థలో ఉన్నా అవ తననెంతో ఆకర్షించాయి. దాంతో ఒకటీ రెండూ కాదు ఏకంగా మూడు ఇళ్లు కొనుగోలు చేసింది.

బ్రెజిల్‌కు చెందిన రుబియా కాలిఫోర్నియాలో నివసిస్తోంది. తన చిన్ననాటి ఇంటిని గుర్తుచేసే ఆ ఇళ్లు తనకెంతో నచ్చాయి. స్థానికులకు ఆమెను తమలో ఒకరిగా చూశారు. వారి ఆదరణకు ఆమె అచ్చెరువొందింది. వారు చూపించిన ప్రేమా, ఆప్యాయతలకు ఫిదా అయిన రుబియా శిధిలావస్ధలో ఉన్న ఇళ్లను కొనుగోలు చేసి వాటిని పునరుద్ధరించాలనే ఆలోచనకు దోహదపడ్డాయి.

ప్రస్తుతం, రూబియా శాన్ ఫ్రాన్సిస్కో, ముస్సోమెలిల మధ్య ప్రయాణిస్తూ పూర్తిగా కొత్త జీవితాన్ని గడుపుతోంది. ముఖ్యంగా, ఆమె గృహాలలో ఒకదానిని ఆర్ట్ గ్యాలరీగా మార్చాలనుకుంటోంది. ఇది స్థానిక ప్రతిభను ప్రదర్శిస్తుంది, సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహిస్తుంది. మరొక ఇల్లు ఆమె స్వంత నివాసంగా మార్చుకునే పనిలో ఉంది. అక్కడ ఉన్న వారికి మరింత చేరువయ్యేందుకు సహాయపడుతుంది.

మూడవ ఇల్లు వెల్‌నెస్ సెంటర్‌గా మార్చాలని యోచిస్తోంది. ఆమె 2020లో కొనుగోలు చేసిన ఇళ్ల పునరుద్ధరణ ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే రెండు ఇళ్లను అందంగా ముస్తాబు చేసింది. రూబియా డేనియల్స్ మూడు శిథిలమైన ఆస్తులను అందమైన నిర్మాణాలుగా మార్చడమే కాకుండా సమాజంలోని ఆశావాదాన్ని పునరుజ్జీవింపజేస్తోంది. ఆమె ప్రాజెక్టులు ఇతర పట్టణాలకు స్ఫూర్తిదాయకంగా పనిచేస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story