మద్యం సేవించిన పైలెట్.. ఆఖరి క్షణంలో ఫ్లైట్ క్యాన్సిల్..

మద్యం సేవించిన పైలెట్.. ఆఖరి క్షణంలో ఫ్లైట్ క్యాన్సిల్..
తాగి రోడ్డు మీద నడుస్తుంటేనే తూలుతుంటారు.. అలాంటిది ఆకాశంలో ఎగిరే విమానం

తాగి రోడ్డు మీద నడుస్తుంటేనే తూలుతుంటారు.. అలాంటిది ఆకాశంలో ఎగిరే విమానం.. అందునా 267 మంది ప్రయాణికులు ఉన్న ఫ్లైట్ నడపడానికి సిద్ధమయ్యాడు ఓ పైలెట్ మహాశయుడు.. అతని వాలకం చూసి అనుమానం వచ్చిన అధికారులు ఆఖరి క్షణంలో అతడిని ఫ్లైట్ ఎక్కకుండా అడ్డుకున్నారు.. దాంతో అంతమంది ప్రయాణికులు బతికిపోయారు.. లేకపోతే ఎంత ఘోరం జరిగేదో ఊహించుకోవడానికే కష్టంగా ఉంది.

ప్యారిస్‌లో యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ టేకాఫ్ కి కొన్ని క్షణాల ముందు క్యాన్సిల్ చేయబడింది. పైలట్ మద్యం తాగి డ్యూటీకి వచ్చాడు. దాంతో అతడి వాలకాన్ని పసిగట్టిన అధికారులు విధులనుంచి తొలగించారు. కోర్టు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. $5,000 జరిమానా విధించింది.

యునైటెడ్ ఎయిర్‌లైన్స్ పైలట్ తాగి వచ్చినందుకు పారిస్ నుండి వాషింగ్టన్ DCకి వెళ్లే విమానాన్ని రద్దు చేయాల్సి వచ్చిందని న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. 63 ఏళ్ల యుఎస్ పైలట్ ఆదివారం 267 మంది ప్రయాణికులతో పారిస్‌లోని చార్లెస్ డి గల్లె విమానాశ్రయం నుండి వర్జీనియాలోని వాషింగ్టన్ డల్లెస్ విమానాశ్రయానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాడు.

అయితే, అతను వచ్చినప్పుడు కళ్లు ఎర్రగా ఉండడం, తూలుతూ ఉండడం, మాట తడబడడం వంటి లక్షణాలను భద్రతా అధికారులు గుర్తించారు. వెంటనే అతడికి ఆల్కహాల్ పరీక్షలు చేశారు. తాగి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఫ్రాన్స్‌లోని విమాన సిబ్బంది తీసుకునే మద్యానికి ఆరు రెట్లు ఎక్కువగా సేవించాడని తెలుసుకున్నారు.

పైలట్‌ని ప్రశ్నించగా, తాను ముందురోజు రాత్రి కేవలం రెండు గ్లాసుల వైన్ మాత్రమే తాగానని కోర్టుకు తెలిపాడు. అయితే న్యాయమూర్తి అతడి మాటలపై అనుమానం వ్యక్తం చేశారు. మీరు మద్యం తాగి విమానం నడిపుదామనుకున్నారా.. దీని వలన 267 మంది ప్రయాణికులను ప్రమాదంలో పడవేసినట్లయ్యేది. అదృష్టం బావుండి భద్రతా సిబ్బంది గుర్తించారు అని అతడికి చీవాట్లు పెట్టారు.

"మా కస్టమర్‌లు మరియు సిబ్బంది యొక్క భద్రత ఎల్లప్పుడూ మా మొదటి ప్రాధాన్యత. మేము మా ఉద్యోగులందరినీ అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉంచుతాము. మద్యం పట్ల కఠినమైన నో టాలరెన్స్ పాలసీని కలిగి ఉన్నాము" అని యునైటెడ్ ఎయిర్‌లైన్స్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story