కరోనాపై తీర్మానం ఆమోదించిన ఐక్యరాజ్యసమితి.. వ్యతిరేక ఓటు వేసిన అమెరికా
కరోనాను నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలు ఏకమై విస్తృత చర్యలు చేపట్టాలన్న తీర్మానానికి ఐక్యారాజ్యసమితి ఆమోదించింది.

కరోనాను నిర్మూలించేందుకు ప్రపంచ దేశాలు ఏకమై విస్తృత చర్యలు చేపట్టాలన్న తీర్మానానికి ఐక్యారాజ్యసమితి ఆమోదించింది. మొత్తం 169 సభ్యదేశాలు ఈ తీర్మానానికి తమ మద్దతు తెలిపాయి. ఈ తీర్మానానికి ఏకగ్రీవంగా ఆమోదం తెలపాలని ఆశించినప్పటికీ.. అమెరికా, ఇజ్రాయెల్‌లు వ్యతిరేకంగా ఓటు వేశాయి. యూక్రెయిన్, హంగరీ దేశాలు వోటింగ్‌కు దూరంగా ఉన్నాయి. అయితే, భారీ మెజార్టీతో ఈ తీర్మానానికి ఆమోదం లభించింది. ఐక్యరాజ్యసమితి ఇప్పటివరకూ మొత్తం మూడు తీర్మానాలు కరోనాపై ఆమోదించింది. ఏప్రిల్ 2న తొలి తీర్మానం, ఏప్రిల్ 20న రెండో తీర్మానం, తాజాగా శుక్రవారం మూడో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదించారు. మూడో తీర్మానంలో కరోనాను మునుపెన్నడూ చూడని ప్రపంచస్థాయి సవాలుగా అభివర్ణించింది. ఐక్యరాజ్యసమితి చిరిత్రలోనే ఇది మునుపెన్నడూ ఎరుగని పరిస్థితి అని వ్యాఖ్యానించింది. కరోనా కట్టడి కోసం అన్ని రకాల వైద్య సేవలూ, ఔషధాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ సభ్య దేశాలను యూఎన్ పిలుపు నిచ్చింది.
RELATED STORIES
Nani: నాని కెరీర్లో మొదటిసారి.. పాన్ ఇండియా దర్శకుడితో సినిమా..
23 May 2022 3:23 PM GMTManchu Vishnu: మంచు విష్ణుతో జెనీలియా.. క్రేజీ పోస్ట్ వైరల్..
23 May 2022 1:30 PM GMTKushi 2022: శరవేగంగా 'ఖుషి' షూటింగ్.. ఇంతలోనే మరో అప్డేట్..
23 May 2022 12:15 PM GMTMajor: 'మేజర్' మూవీ టీమ్ సూపర్ ప్లాన్.. ఫస్ట్ టైమ్ ఇలా..
23 May 2022 10:39 AM GMTPayal Rajput: స్టేజ్‌పైనే బాయ్‌ఫ్రెండ్‌కు లిప్ లాక్ ఇచ్చిన హీరోయిన్..
22 May 2022 2:45 PM GMTBalakrishna: బాలయ్య సరసన బిగ్ బాస్ విన్నర్.. కీలక పాత్రలో మరో యంగ్...
22 May 2022 2:13 PM GMT