US Visa: రికార్టు సృష్టించిన ఎంబసీ.. ఈ ఏడాది 10 లక్షల వీసాలు జారీ

US Visa: రికార్టు సృష్టించిన ఎంబసీ.. ఈ ఏడాది 10 లక్షల వీసాలు జారీ
అన్న మాట నిలబెట్టుకున్న అమెరికా .. 2023లో భారతీయులకు 10 లక్షల వీసాలు

భారత్ లోని అమెరికా ఎంబసీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏడాది US Visa: రికార్టు సృష్టించిన అమెరికా ఎంబసీ.. ఈ ఏడాది 10 లక్షల వీసాలు జారీ జారీచేయాలనే లక్ష్యాన్ని చేరుకుంది. ఇప్పటివరకు భారతీయులకు జారీచేసిన వీసాల సంఖ్య 10లక్షలు దాటింది. ప్రపంచవ్యాప్తంగా అమెరికా జారీ చేసిన వీసాల్లో భారత్ వాటా 10శాతంగా ఉంది. విద్యార్థి వీసాల్లో 20శాతం, H, L.,కేటగిరీకి చెందిన ఉద్యోగ వీసాల్లో 65శాతం భారతీయులకే జారీ అయ్యాయి. ఈ మేరకు అమెరికా రాయబార కార్యాలయం....సామాజిక మాధ్యమం ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే, ఇక్కడితో ఆగిపోమని, రాబోయే రోజుల్లో మరింత వృద్ధి సాధిస్తామని పేర్కొంది. అమెరికాలో పర్యటించేందుకు మరింత మంది భారతీయులకు అవకాశం కల్పిస్తామని అమెరికా ఎంబసీ తెలిపింది. వీసాల రికార్డుపై భారత్ లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి హర్షం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక సంబంధాల్లో ముఖ్యమైన దేశాల్లో భారత్ ఒకటని, ప్రపంచంలోనే అత్యంత కీలకబంధం తమదేనన్నారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతమైందని ఎరిక్ గార్సెట్టి ఆశాభావం వ్యక్తం చేశారు.


భారత్, అమెరికా పౌరుల మధ్య పరస్పర సంబంధాలు మెరుగుపడాలన్నదే ఇరుదేశాల అభిమతమని భారత్ లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెటీ తెలిపారు. ఈ దిశగా భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కృషి చేస్తున్నారన్నారు. ఈ సంవత్సరం 10 లక్షల వీసాల ప్రాసెసింగ్ ను సాధ్యం చేసిన కాన్సులేట్ ఉద్యోగులను ఆయన అభినందించారు. మరో 3 నెలల సమయం ఉండగానే, 10 లక్షల వీసా దరఖాస్తులను ప్రాసెస్ చేసిన ఉద్యోగులు, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేసవిలో, జూన్ నుంచి ఆగస్ట్ మధ్య సుమారు 90 వేల స్టుడెంట్ వీసాలను జారీ చేశామని యూఎస్ ఎంబసీ ప్రకటించింది. అమెరికా జారీ చేసిన మొత్తం వీసాల్లో 25% భారతీయ స్టుడెంట్స్ పొందారని తెలిపింది. వీసాలు పొందిన ఇండియన్ స్టుడెంట్స్ కు శుభాకాంక్షలు తెలిపింది. గతేడాది అమెరికాను 1.2 లక్షల మంది భారతీయులు సందర్శించారని, వీసా ప్రాసెసింగ్‌ను సులభతరం చేసేందుకు సిబ్బందిని విస్తరిస్తున్నామని, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో కొత్త కాన్సులేట్ భవనాలను ప్రారంభించినట్లు పేర్కొంది.

Tags

Read MoreRead Less
Next Story