Ukraine : నిఘా తూనీగ

Ukraine : నిఘా తూనీగ
అమెరికా నుంచి ఉక్రెయిన్ కు అతి చిన్న డ్రోన్

రష్యా చేసే దాడికి ప్రతిదాడి చేయడానికి మరిన్ని అత్యాధునిక ఆయుధాలను సంపాదించుకోవడంలో ఉక్రెయిన్ పరుగులు పెడుతోంది. తాజాగా ఉక్రెయిన్ కు అతి చిన్న డ్రోన్లను సరఫరా చేసేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ మేరకు 400 మిలియన్ డాలర్ల ప్యాకేజీని మంగళవారం వాషింగ్టన్ ప్రకటించింది. దీనిలో తొలిసారిగా బ్లాక్ హార్నెట్ నిఘా డ్రోన్ లను కూడా అందజేయనుంది.

నార్వేలో తయారుచేసిన కొన్ని డ్రోన్లను ఇప్పటికే ఉక్రెయిన్ వాడుతోంది. వాటిని గతంలో బ్రిటన్ నార్వేలు విరాళంగా అందించాలి. ఇప్పుడు అమెరికా కూడా భారీగా డ్రోన్లను ఉక్రెయిన్ సమకూరుస్తోంది ఇందు కోసం ఏప్రిల్ లోనే సమాలోచనలు జరిగాయి.

గతేడాది యుద్ధంలో కూడా 850 మైక్రో డ్రోన్లను బ్రిటన్, నార్వేలు అందించాయి. నిఘా కోసం నార్వే వీటిని అభివృద్ధి చేసింది. 25 నిమిషాల వరకు ప్రయాణించగలిగే ఈ డ్రోన్ బరువు 33 గ్రాములు కాగా జాయ్ స్టిక్, ఇంకో డ్రోన్ ఇలా మొత్తం సిస్టం బరువు 1.3కిలోలు మాత్రమే. అందుకే వీటిని సైనికులు తేలిగ్గా తీసుకువెళ్లొచ్చు. అలాగే గంటకు 28 కిలోమీటర్ల వేగంతో వీచేగాలులను ఇవి తట్టుకోగలుగుతాయి. తక్కువ రిజల్యూషన్ ఉన్న చిత్రాలను వీడియోలను ఇవి రెండు కిలోమీటర్ల దూరంలోని కంట్రోల్ స్టేషన్ కి పంపించగలవు. వీటిని జూమ్ చేస్తే శత్రువులను చూడవచ్చు.


నిజానికి డ్రోన్లు చాలా రూపాల్లో, చాలా పరిమాణాల్లో ఉంటాయి. అతి చిన్న డ్రోన్ లు కెమెరా వంటి చిన్న పరికరాలను మోయగలవు. అతి పెద్ద డ్రోన్లు చిన్నపాటి విమానాల్లాగా కనిపిస్తాయి. సాధారణంగా సైన్యం వీటిని ఎక్కువగా వాడుతుంటుంది. కానీ ఇప్పుడు అందిస్తున్న ఈ చిన్న డ్రోన్లు శత్రువు యొక్క స్థావరాలకు కాస్త దగ్గరగా వెళ్ళటానికి సహాయం చేస్తాయి.

ఉక్రెయిన్ కోసం అమెరికా అందించిన 43వ సెక్యూరిటీ అసిస్టెన్స్ ప్యాకేజీ ఇది. 2022లో రష్యా దాడి చేసినప్పటి నుంచి యూఎస్ ఉక్రెయిన్ కు తన సహాయ సహకారాలు అందిస్తూనే ఉంది. ఈ ప్యాకేజీ పై అమెరికా విదేశాంగ శాఖ మంత్రి ఆంటోనీ బ్లింకన్ మాట్లాడుతూ రష్యా ఎప్పుడైనా ఈ యుద్ధం ముగించి తన దళాలను వెనక్కి పిలవచ్చు. కానీ అప్పటివరకు అమెరికా మిత్ర దేశాలు ఉక్రెయిన్ కు సహాయపడుతూనే ఉంటాయని ప్రకటించారు. అయితే నల్ల సముద్ర ధాన్యం ఒప్పందం నుంచి రష్యా బయటకు వచ్చిన తర్వాత ఉక్రెయిన్ పై దాడులు మరింత ముమ్మరం చేసినది తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story