చైనా పాఠ్య పుస్తకంలో ఉత్తరాఖండ్ 'దేవ్ రాటూరి' సక్సెస్ స్టోరీ

చైనా పాఠ్య పుస్తకంలో ఉత్తరాఖండ్ దేవ్ రాటూరి సక్సెస్ స్టోరీ
ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ గర్వాల్ జిల్లాలోని కెమ్రియా సౌర్ గ్రామానికి చెందిన దేవ్ రాటూరి (46) బ్రూస్ లీ అభిమాని.

ఉత్తరాఖండ్‌లోని టెహ్రీ గర్వాల్ జిల్లాలోని కెమ్రియా సౌర్ గ్రామానికి చెందిన దేవ్ రాటూరి (46) బ్రూస్ లీ అభిమాని. ముంబైలో హిందీ సినిమాలో పాత్ర కోసం ఒకసారి ఆడిషన్‌కు వెళ్లాడు. అయితే అతడే ఒకరోజు చైనీస్ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేస్తానని కానీ, బాగా పేరు తెచ్చుకుంటానని కానీ అతనికి తెలియదు. అతని కథ చైనా పాఠ్యపుస్తకాలలో పాఠ్యాంశంగా మారండం ఊహించని పరిణామం.

అతను ఒక రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేయడానికి చైనాకు చేరుకున్న పద్దెనిమిదేళ్ల తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. చైనీస్ చిత్ర పరిశ్రమలో పెద్దగా పేరు తెచ్చుకున్న దేవ్, తెహ్రీ గర్వాల్‌లోని రైతు కుటుంబంలో జన్మించాడు. భారత్ లో కరాటే నేర్చుకున్నాడు. తదుపరి శిక్షణ కోసం చైనాకు వెళ్లే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడు. మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ పొందాలనే అతడి కల అతడికి నిద్ర పట్టనివ్వకుండా చేసింది. చైనాకు వెళ్లాడు. అక్కడ శిక్షణ పొందాడు. అయితే, తదుపరి శిక్షణ కోసం ప్రఖ్యాత సన్యాసుల సంస్థ అయిన షావోలిన్ టెంపుల్‌కి వెళ్లాలని అక్కడి స్థానికులు చెప్పడంతో అతడి ఆశలు అడియాశలయ్యాయి.

దేవ్ 2005లో చైనా షెన్‌జెన్‌లోని భారతీయ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా ఉద్యోగం సంపాదించాడు. దానికంటే ముందు తన కుటుంబాన్ని పోషించడానికి దాదాపు పదేళ్లు ఢిల్లీలో చిన్నపాటి ఉద్యోగాలు చేశాడు. “రూ. 10,000 నెలవారీ జీతంతో చైనా రెస్టారెంట్‌లో వెయిటర్‌గా ఏడేళ్లు పని చేశాడు. ఆ తరువాత మేనేజర్ స్థాయికి ఎదిగాడు. 2013లో, జియాన్‌లో రెడ్ ఫోర్ట్ అనే స్వంత రెస్టారెంట్‌ని ఓపెన్ చేశాడు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను అందులో మేళవించి రెస్టారెంట్ ని రూపుదిద్దాడు.

అదృష్టం కొద్దీ, రాటూరి 2017లో ఒకరోజు తన రెస్టారెంట్ లో భోజనం చేసేందుకు వచ్చిన చైనీస్ దర్శకుడిని కలిశాడు. కళల పట్ల ఆసక్తి ఉన్న దేవ్ కి అతడి పరిచయం చాలా ఉపయోగపడింది. అతనికి SWAT అనే టీవీ సిరీస్‌లో చిన్న పాత్రను ఆఫర్ చేశారు చైనీస్ దర్శకుడు. అది సక్సెస్ అవడంతో మరిన్ని అవకాశాలు రావడం మొదలు పెట్టాయి. అప్పటి నుండి, అతను 35 కి పైగా చైనీస్ చలనచిత్రాలు, చాలా టీవీ సీరియల్స్‌లో నటించాడు. ఇందులో అతను ప్రముఖ పాత్ర పోషించిన 'మై రూమ్‌మేట్ ఈజ్ ఎ డిటెక్టివ్' వంటి ప్రముఖంగా చెప్పుకోదగినవి. దాంతో దేవ్ రెస్టారెంట్ బిజినెస్ కూడా విస్తరించింది. ఈరోజు చైనాలో ఎనిమిది రెస్టారెంట్లకు యజమాని అయ్యాడు దేవ్.

“చైనీస్ సినిమాలో దేవ్ చాలా పాపులర్ అయ్యాడు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో స్థానికులు తనపై అపారమైన ప్రేమను కురిపించినట్లు చెబుతాడు. వారు తనను స్వంత వ్యక్తిలా చూసుకున్నారని అంటాడు. తనకు భార్య అంజలి, ఇద్దరు కుమారులు ఆరవ్ ( 11), అర్నవ్‌ (9) ఉన్నారని తెలిపాడు. దేవ్ కుటుంబంతో కలిసి జియాన్‌లో నివసిస్తున్నారు. కానీ దేవ్ తాను పుట్టిన ఉత్తరాఖండ్ తన హృదయానికి దగ్గరగా ఉంటుంది అని అంటారు. అతను తన గ్రామం నుండి దాదాపు 150 మంది నిరుద్యోగులను చైనాకు తీసుకువచ్చి వారికి జీవన భృతి కల్పించాడు. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. తన మొత్తం 70 మంది సిబ్బందిలో 40 మంది ఉత్తరాఖండ్‌కు చెందినవారు కాగా మిగిలినవారు చైనీస్" అని చెప్పారు.

వెయిటర్ గా పని చేసేందుకు దేశం కాని దేశం వచ్చి సినిమాల్లో అవకాశాలు తెచ్చుకుని పాపులర్ నటుడిగా ఎదగడమే కాక, ఎనిమిది రెస్టారెంట్లు స్థాపించి ఎందరికో ఉద్యోగాలు ఇప్పించిన అతడి స్ఫూర్తిదాయక కథను విద్యార్థులకు తెలియజేయాలనుకుంది. అందుకే అతడి సక్సెస్ స్టోరీని ఇంగ్లీషు సబ్జెక్టులో పాఠ్యాంశంగా చేర్చింది. ఇప్పుడు ఏడవ తరగతి విద్యార్థులు దేవ్ గురించి చదువుతున్నారు. దేవ్ ని స్ఫూర్తిగా తీసుకుంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story