హెలికాప్టర్ నుంచి కోట్లు కుమ్మరించిన ఇన్‌ఫ్లుయెన్సర్.. బ్యాగుల్లో సర్ధుకున్న జనం

హెలికాప్టర్ నుంచి కోట్లు కుమ్మరించిన ఇన్‌ఫ్లుయెన్సర్.. బ్యాగుల్లో సర్ధుకున్న జనం
ఏంటి ఆయనకు అంత ఎక్కువ వున్నాయా డబ్బులు.. అడుక్కునే వాడికి ఒక్క ఐదురూపాయలు వెయ్యాలంటే ఎంతో ఆలోచిస్తాం.

ఏంటి ఆయనకు అంత ఎక్కువ వున్నాయా డబ్బులు.. అడుక్కునే వాడికి ఒక్క ఐదురూపాయలు వెయ్యాలంటే ఎంతో ఆలోచిస్తాం. అలాంటిది మన లెక్కల్లో 7 కోట్ల రూపాయలు.. అలా ఎలా చేశాడు బాస్.. ఆశ్చర్యంగా ఉంది.. అసలు ఎందుకు ఇలా చేశాడో తెలుసుకోవాలనుంది కదా..

చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రఖ్యాత ఇన్‌ఫ్లుయెన్సర్, టెలివిజన్ హోస్ట్ అయిన కజ్మాగా పేరుగాంచిన కమిల్ బర్తోషేక్, హెలికాప్టర్ నుండి ఒక మిలియన్ డాలర్లను కుమర్మరించాడు. కజ్మా చిత్రం 'వన్‌మాన్‌షో: ది మూవీ'లో నిగూఢంగా ఉన్న ఓ సందేశాన్ని డీకోడ్ చేయమని ప్రేక్షకులకు సవాల్ విసిరాడు. పోటీలో పాల్గొన్న ఒక్క అదృష్ట విజేతకు ఒక మిలియన్ డాలర్ ఇస్తానని పేర్కొన్నాడు. అయితే పోటీదారులకు పజిల్ పూర్తి చేయలేకపోయారు. ఒక్కరు కూడా ఆన్సర్ కనిపెట్టలేకపోయారు.

కానీ కజ్మా పోటీలో పాల్గొన్న వారిని నిరుత్సాహపరచదలుచుకోలేదు. ప్రత్యామ్నాయ ఉపాయాన్ని ఆలోచించాడు. పేరు నమోదు చేసుకున్న పోటీదారులందరికీ సంపదను పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఆ విషయాన్ని పోటీలో పాల్గొన్న వారందరికీ తెలియజేస్తూ ఇమెయిల్‌ను పంపాడు. ఫలానా చోటుకు వచ్చి డబ్బు తీసుకుని వెళ్లండి అని మెయిల్ సారాంశం. తన మాటను నిజం చేస్తూ హెలికాప్టర్‌తో పాటు నిర్ణీత సమయానికి నిర్ణీత ప్రదేశానికి చేరుకున్నాడు.

ఈ అసాధారణ దృశ్యం కజ్మా యొక్క అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయబడింది. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి "మనీ వర్షం"గా లేబుల్ చేయబడింది. ఎటువంటి గాయాలు లేదా మరణాలు సంభవించకుండా ఒక మిలియన్ డాలర్లు చెక్ రిపబ్లిక్ మీదుగా ఆకాశం నుండి మెల్లగా దిగివచ్చాయని అతను ఆనందంగా ప్రకటించాడు.

స్వర్గం నుండి కురుస్తున్న డాలర్లను మైదానంలో గుమిగూడిన వేలాది మంది జనం సేకరించి తమ వెంట తెచ్చుకున్న బ్యాగుల్లో నింపుకున్నారు. ఒక గంటలోపు మైదానం మొత్తం ఖాళీ అయిపోయింది. దాదాపు 4,000 మంది వ్యక్తులు డాలర్లను విజయవంతంగా సేకరించారని కజ్మా నివేదించింది. వీటిలో ప్రతి ఒక్కటి QR కోడ్‌ను కలిగి ఉంది. ఇది విజేతలు స్వచ్ఛంద కార్యక్రమాలకు విరాళం ఇవ్వడాన్ని పరిగణించేందుకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌కు లింక్ చేయబడింది.

ఈవెంట్‌కు ముందు, కజ్మా ఒక వీడియోను పంచుకున్నారు, "కష్టపడకుండా వచ్చిన డబ్బుతో ఏమి చేయాలనే దాని గురించి మీరు మాకు చాలా ఆలోచనలు ఇచ్చారు. ఎవరికైనా సహాయం చేయడం, సహకారం అందించడం, ఒక మంచి పని కోసం వినియోగించడం. కాబట్టి, ఈ మూడు లక్ష్యాలను ఎలా కలపాలి అని నేను ఆలోచించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను అని వివరించారు. కష్టపడకుండా వచ్చినా, కష్టపడి సంపాదించినా పెట్టే మనసు కూడా అందరికీ ఉండదు.. అందుకు కజ్మా మినహాయింపు. అదే ఇప్పుడు అతడికి మరింత మంది అభిమానులను సంపాదించి పెట్టింది. మంచి పనికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story