British Prime Minister Liz Truss: మొన్నే ప్రధానిగా పగ్గాలు.. అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత.. కారణం!!

British Prime Minister Liz Truss: మొన్నే ప్రధానిగా పగ్గాలు.. అప్పుడే ప్రజల్లో వ్యతిరేకత.. కారణం!!
British Prime Minister Liz Truss: బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. లిజ్‌ ట్రస్‌ పన్నుల విధానంపైన బ్రిటన్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రిషి సునాక్ ప్రధాని అవుతారంటూ బ్రిటన్‎లో జోరుగా బెట్టింగ్ సాగుతోంది.

British Prime Minister Liz Truss: బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది. లిజ్‌ ట్రస్‌ పన్నుల విధానంపైన బ్రిటన్‌లో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో రిషి సునాక్ ప్రధాని అవుతారంటూ బ్రిటన్‎లో జోరుగా బెట్టింగ్ సాగుతోంది. బ్రిటన్‌ ప్రధాని లిజ్ ట్రస్ అధికారం చేపట్టిన కొన్నిరోజులకే సొంత పార్టీలో సంక్షోభం నెలకొంది.

స్టాక్‌ మార్కెట్లలోనూ ట్రస్ విధానాలపై వ్యతిరేకత నెలకొంది. ట్రస్‌ను దించి మాజీ మంత్రి రిషి సునాక్‌ను తెరపైకి తెచ్చేందుకు టోరి సభ్యులు రెడీ అవుతున్నారని సమాచారం. ట్రస్ సర్కార్‌ ప్రవేశ పెట్టిన మినీ బడ్జెట్ దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలై గందరగోళానికి దారి తీసింది. దీంతో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు అధికమయ్యాయి.

దీంతో ఆమె స్థానంలో రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని పదవిని చేపడతాడంటూ జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. క్వాసీ కార్టెంగ్‌ను ఆర్థికమంత్రి పదవి నుంచి తప్పించారు. ట్రస్ ఆర్థిక విధానాల అమలు బాధ్యతలను క్వాసీనే పర్యవేక్షిస్తున్నాడు.

ఇక సెప్టెంబర్‌ 5న భారత సంతతికి చెందిన మాజీ మంత్రి రిషి సునాక్‌ను ఓడించి లిజ్‌ ట్రస్‌ బ్రిటన్‌ ప్రధాని పీఠమెక్కారు. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయిన కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ను తగ్గిస్తానని, చుక్కలనంటుతున్న ఇంధన ధరలను అదుపులొకి తెస్తానని, కట్టు తప్పుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని ప్రకటించారు.


కానీ నెల రోజుల్లోనే అన్నివైపుల నుంచీ ఆమెకు గట్టిగా సెగ తగులుతోంది. ఆర్థిక వ్యవస్థను పట్టాలకెక్కించేందుకు ఆమె ప్రతిపాదించిన విధానాలన్నీ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేకపోయారు. కార్పొరేషన్‌ ట్యాక్స్‌ను 19 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని దాన్ని ఎప్పట్లా 25 శాతంగానే కొనసాగిస్తామంటూ యూ టర్న్‌ తీసుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నీ కన్జర్వేటివ్‌ నేతలు, ఎంపీలను బాగా కలవరపెడుతున్నాయి.

ఈ నేపథ్యంలో, బ్రిటన్ లో పందాలు మొదలయ్యాయి. లిజ్ ట్రస్ ప్రధాని పదవి నుంచి దిగిపోవడం ఖాయమని, రిషి సునాక్ పగ్గాలు అందుకుంటారని బ్రిటీష్‌ పౌరులు కాస్తున్నారు. బెట్టింగ్ సంస్థల ట్రెండ్స్ కూడా రిషి సునాకే ఫేవరెట్ అంటున్నాయి. ఇటీవల ఎన్నికల్లో ఓడిన రిషి సునాక్ ప్రస్తుత పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.


ఆ దిశలోనే గత కొన్ని రోజులుగా డిన్నర్‌ పాలిటిక్ప్‌ సాగిస్తున్నారని బ్రిటిష్‌ మీడియా అంటోంది.. దాదాపు 62 మంది టోరి సభ్యులు కూడా రిషి సునాక్‌ వైపు మొగ్గుచూపుతున్నారంటూ కధనాలు కూడా వస్తున్నాయి. రిషీని ప్రధానిగా, పెన్నీ మోర్డంట్‌ను ఆయనకు డిప్యూటీగా నియమించే ఆలోచన సాగుతోందంటున్నారు. లేదంటే మోర్డంట్‌ ప్రధానిగా, రిషి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టొచ్చని ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story