అధికారంలోకి వచ్చినా తాలిబన్ నాయకుడు ఎక్కడా అడ్రస్ లేడు.. ఎందుకని?

అధికారంలోకి వచ్చినా తాలిబన్ నాయకుడు ఎక్కడా అడ్రస్ లేడు.. ఎందుకని?
తాలిబన్ల అరాచక పాలన మళ్లీ మొదలైంది. ఈ క్రమంలో తాలిబన్లను నడిపించే నాయకుడంటూ ఒకడు ఉండాలి కదా.

తాలిబన్ల అరాచక పాలన మళ్లీ మొదలైందని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు ఆఫ్గన్లు.. కొందరు బతికుంటే బలుసాకు తినొచ్చని కట్టుబట్టలతో వలస వెళ్లి పోతున్నారు. . ఇప్పుడు అతడు ఎక్కడ ఉన్నాడు. ఎందుకు బయటకు కనిపించట్లేదు.. ఇవి అందరికీ వచ్చే సందేహాలు. తాలిబన్ల

'అత్యున్నత నాయకుడు' హిబతుల్లా అఖుంజాదా యొక్క ఒక ఫోటోను మాత్రమే ఎందుకు విడుదల చేసింది అనేది నిగ్గు తేల్చాల్సిన అంశమే.

పాకిస్తాన్ భద్రతా విశ్లేషకుడి వివరణ ప్రకారం అతడి రోజువారీ కార్యకలాపాలు తెలియదు, ఇస్లామిక్ సెలవు దినాలలో మాత్రమే వార్షిక సందేశాన్ని విడుదల చేస్తాడు. అఖుంద్‌జాదా ఆచూకీ గురించి అడిగినప్పుడు తాలిబాన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ ఈ వారం విలేకరులతో మాట్లాడుతూ "దేవుడు కోరుకుంటే మీరు అతడిని త్వరలో చూస్తారు.

హిబతుల్లా అఖుంద్‌జాదా ఎవరు?

హిబతుల్లా అఖుంద్‌జాదా 2016 నుండి గ్రూప్ చీఫ్. ఆఫ్ఘనిస్తాన్‌లో సోవియట్ దండయాత్ర సమయంలో ఇస్లామిస్ట్ ప్రతిఘటనలో పాల్గొన్న కందహార్ నాయకుడు మిలిటరీ కమాండర్ కంటే మత నాయకుడిగా పేరుపొందారు. 2016 లో యుఎస్ డ్రోన్ దాడిలో మన్సూర్ మరణించిన తరువాత అతను అక్తర్ మొహమ్మద్ మన్సూర్ వారసుడిగా ప్రకటించబడ్డాడు. అక్తర్ మొహమ్మద్ మన్సూర్ హిబాతుల్లా అఖుంజాదా తన వారసుడిగా ఉండాలని కోరుకున్నాడు.

నివేదికల ప్రకారం తాలిబన్ పాలనలో, హిబతుల్లా అఖుంద్‌జాదా సుప్రీం కోర్టుకు డిప్యూటీ హెడ్‌గా ఉన్నారు. 2001 తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ పతనం తరువాత, అతడు మత పండితుల సమూహానికి అధిపతి అయ్యాడు.

హిబతుల్లా అఖుంద్‌జాదా ఎక్కడ ఉన్నారు?

"అఖుంద్‌జాదా కనిపించక పోవడం వలన అతని ఆరోగ్యం గురించి అనేక పుకార్లు వచ్చాయి. అతను కోవిడ్ బారిన పడ్డాడని కొంతమంది, మరికొందరు బాంబు దాడిలో మరణించాడని పలు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే ఈ వార్తలను నిరూపించే మార్గం కూా లేదు. కానీ అఖుంద్‌జాదా గోప్యత సున్నితమైన అంశంగా పరిగణిస్తున్నారు తాలిబన్లు.

ఎందుకు ఈ గోప్యత

తాలిబన్ నాయకత్వానికి ఇది కొత్తేమీ కాదు. ఎందుకంటే చాలా మంది అగ్ర నాయకులు కొన్నేళ్లుగా అజ్ఞాతంలో ఉంటున్నారు. తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా మహ్మద్ ఒమర్ ఒక రహస్య వ్యక్తి, అతను సందర్శకులను కలవడానికి కూడా ఇష్టపడలేదు. ఈ ధోరణికి అనేక కారణాలు ఉండవచ్చు. వాటిలో భద్రతా కారణాలు కూడా ఒకటి.

"విదేశీ దళాలు ఆఫ్ఘన్ గడ్డపై ఉన్నంత వరకు తాలిబన్లు తమను తాము జిహాద్ స్థితిలో ఉన్నట్లు భావిస్తారు. వారు వెళ్లిపోయే వరకు తమ నాయకుడిని దాచిపెడతారు. అందుకే అత్యున్నత నాయకుడు అందరికీ కనిపించడు అని పాకిస్తాన్ ఆధారిత భద్రతా విశ్లేషకుడు ఇమ్తియాజ్ గుల్ జాతీయ వార్తా సంస్థలకు వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story