డాక్టర్ పాడుపని.. ఆస్పత్రికి వచ్చిన మహిళలకు తన వీర్యంతోనే..

డాక్టర్ పాడుపని.. ఆస్పత్రికి వచ్చిన మహిళలకు తన వీర్యంతోనే..
న్యూయార్క్‌ సిటీకి చెందిన ఓ మహిళ ఫెర్టిలిటీ డాక్టర్‌పై దావా వేసింది. అతడు తన సొంత స్పెర్మ్‌ని ఉపయోగించి అనేక మంది మహిళల

న్యూయార్క్‌ సిటీకి చెందిన ఓ మహిళ ఫెర్టిలిటీ డాక్టర్‌పై దావా వేసింది. అతడు తన సొంత స్పెర్మ్‌ని ఉపయోగించి అనేక మంది మహిళల గర్భధారణకు కారణమయ్యాడు. DNA పరీక్షలు నిర్వహించగా తనకు కనీసం తొమ్మిది మంది తోబుట్టువులు ఉన్నారని ఆమె చెప్పింది.

1980 లో రోచెస్టర్‌లోని ఫెర్టిలిటీ సెంటర్‌కు వెళ్లింది. అక్కడ డాక్టర్ మోరిస్ వోర్ట్‌మన్ ఆమెకు చికిత్స అందించగా ఆమె గర్భం దాల్చింది. స్పెర్మ్ దాత ఒక స్థానిక వైద్య విద్యార్థి అని ఆమెకు డాక్టర్ తప్పుగా చెప్పాడు. దాదాపు 30 ఏళ్ల తరువాత ఆమె కుమార్తె ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. డాక్టర్ నిర్వాకాన్ని బట్టబయలు చేసింది.

ఇటీవలి కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. సంతానోత్పత్తి వైద్యులు రోగులకు చికిత్స చేయడానికి అనామక దాతల నమూనాల కంటే తమ స్వంత స్పెర్మ్‌ను ఉపయోగిస్తున్న ఆరోపణలు ఎక్కువగా వస్తున్నాయి.

ఇండియానాలో ఇదే విధమైన కేసు ఒకటి వెలుగు చూసింది. డా. డోనాల్డ్ క్లైన్ డజన్ల కొద్దీ మహిళలు గర్భం దాల్చడానికి తన స్వంత స్పెర్మ్‌ను ఉపయోగించారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. అతను చివరికి విచారణ సమయంలో పరిశోధకులకు అబద్ధం చెప్పాడు. దీంతో అతడిని వైద్య వృత్తి నుంచి బహిష్కరించారు.

మరొక ఉదాహరణలో, కొలరాడో వైద్యునిపై కనీసం ఆరు కుటుంబాలు కేసు పెట్టాయి. అనేక విజయవంతమైన కృత్రిమ గర్భధారణ ప్రక్రియలలో తన స్వంత స్పెర్మ్‌ను ఉపయోగించారని ఆరోపించారు. న్యూజెర్సీ మహిళ గతంలో ఇదే ఆరోపణలతో మాజీ న్యూయార్క్ వైద్యుడిపై దావా వేసింది.

ఇది ఓ కఠిన వాస్తవం.. జీర్ణించుకోవడం చాలా కష్టం అని బాధిత మహిళలు వాపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story