నాలుగేళ్లుగా చింపాంజీతో మహిళ లవ్ ఎఫైర్.. ఆమెని జూకి రావొద్దన్న నిర్వాహకులు..

నాలుగేళ్లుగా చింపాంజీతో మహిళ లవ్ ఎఫైర్.. ఆమెని జూకి రావొద్దన్న నిర్వాహకులు..
జూలో ఎన్ని జంతువులు ఉన్నా ఆమె దృష్టంతా 38 ఏళ్ల మగ చింపాంజీ పైనే ఉండేది.

ఆమెని నాలుగేళ్లనుంచి చూస్తున్నారు జూ నిర్వాహకులు. కచ్చితంగా వారానికి ఒకసారి జూకి వస్తుంది. మరే జంతువు దగ్గరకూ వెళ్లదు. నేరుగా చింపాంజీ దగ్గరకు వెళుతుంది. ఏవో సైగలు చేస్తుంది. ముద్దులు పెడుతుంది. ఓ గంట వారిద్దరి మధ్య ఏదో సంభాషణ. అధికారులకు వింతగా అనిపించేది. ఆమె వెళ్లిపోయిన తరువాత ఆ చింపాజీ తన తోటి చింపాజీలతో కలిసేది కాదు.

ఈ వింత ప్రవర్తనతో విసిగి పోయిన అధికారులు ఆమెని జూకి రావొద్దని కట్టడి చేశారు. ఆమెపై నిషేధం విధించారు. బెల్జియంకి చెందిన జంతు ప్రేమికురాలు టిమ్మర్ మన్స్.. ఆంట్‌వెర్స్ జంతు ప్రదర్శన శాలను వారానికి ఒకసారి సందర్శించేది. జూలో ఎన్ని జంతువులు ఉన్నా ఆమె దృష్టంతా 38 ఏళ్ల మగ చింపాంజీ పైనే ఉండేది.

చింపాంజీ గ్లాస్ రూములో ఉన్నా బయట నుంచి ఒకరిపై ఒకరు ముద్దులు కురిపించుకునే వారు. చేతులు ఊపుతూ సైగలు చేసుకునేవారు. చూసేవారికి వారి చర్యలు జుగుప్స కలిగించేవి. అధికారులు కంప్లైంట్ ఇవ్వడంతో వారు ఆమెపై నిషేధిత చర్యలు తీసుకున్నారు.

ఆడి, చింపాజీల మధ్య ఉన్న సంబంధం కారణంగా అది రోజుకు 15 గంటలు జనం సందర్శించే సమయాన్ని పూర్తిగా ఒంటరిగా గడుపుతోంది. ఇతర చింపాంజీలతో కలవట్లేదు. ముభావంగా ఉంటోంది. ఆమె వచ్చినప్పుడే ఉత్సాహంగా ఉంటోంది అని జూ క్యురేటర్ సారా బెల్జియన్ ఛానెల్‌కి చెప్పారు.

మనుషులపై ఎక్కువ దృష్టి పెట్టే జంతువులు తోటివారిచే తక్కువగా గౌరవించబడతాయి. వీలైనంత వరకు చింపాంజీ చింపాంజీగానే ఉండాలని మేము కోరుకుంటున్నాము అని ఆయన అన్నారు. ఏడీ నిషేధం తనకు మాత్రమే వర్తిస్తుంది. ఇతర సందర్శకులు స్వేచ్ఛగా చింపాంజీని సందర్శించవచ్చు.

చిటా తన 38 ఏళ్లలో 30 ఏళ్లు జూలో గడిపినట్లు సమాచారం. ఈ చింపాంజీని మొదట్లో ఒకరు తమ పెంపుడు జంతువుగా ఉంచుకున్నారని, కానీ అది పెద్దదయ్యాక దాన్ని నిర్వహించడం కష్టంగా మారి యజమాని జూకు దానం చేశారని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story