Arkansas: అదృష్టం అంటే అదీ.. వాకింగ్‌కి వెళ్లింది.. వజ్రం దొరికింది..

Arkansas: అదృష్టం అంటే అదీ.. వాకింగ్‌కి వెళ్లింది.. వజ్రం దొరికింది..
Arkansas: ఎంత కష్టపడితే లక్షలు సంపాదిస్తాం.. ఒక్కరోజులో రూ.15 లక్షలు సంపాదించడం అంటే మాటలా..

Arkansas: ఎంత కష్టపడితే లక్షలు సంపాదిస్తాం.. ఒక్కరోజులో రూ.15 లక్షలు సంపాదించడం అంటే మాటలా.. పేద్ద బిజినెస్ మాగ్నెట్‌కి అయితే సాధ్యమవతుందేమోకానీ.. సామాన్యులకు మాత్రం చాలా కష్టం. అది ఓ కలగానే మిగిలిపోతుంది. కలత నిద్ర నుండి కాళ్లీడ్చుకుంటూ వాకింగ్‌కి వెళ్లింది. అక్కడ దగ దగా మెరుస్తూ ఓ వజ్రం ఆమె కంట పడింది. అదృష్టం ఈ రూపంలో వరించిందా అని ఆమె సంబర పడుతోంది.

అమెరికాలోని కాలిఫోర్నియాకి చెందిన నొరీన్ రిడ్ బెర్గ్ అనే మహిళ ప్రతిరోజూ సమీపంలోని అర్కన్‌సాస్ స్టేట్ పార్క్‌కి మార్నింగ్ వాక్ వెళ్తుంది. ఆ రోజు కూడా అలానే వెళ్లింది. సడెన్‌గా ఆమెకు పసుపు రంగులో ఉన్న 4.38 క్యారెట్లు ఉన్న వజ్రం దొరికింది. దాని విలువ దాదాపు 2 వేల నుంచి 20 వేల డాలర్లు (సుమారు రూ.15 లక్షలు) ఉంటుందట. 1972 లో ఒకసారి ఇలాంటి వజ్రం దొరికింది. మళ్లీ ఇప్పుడు అలాంటి వజ్రమే దొరికిందని పార్క్ నిర్వాహకులు తెలిపారు.

అయితే ఈ పార్కును సందర్శించే వారికి కనీసం ఒకటి రెండు వజ్రాలైనా దొరుకుతాయట. ఈ పార్క్ ఉన్న ప్రదేశంలో అగ్నిపర్వతం నుంచి పైకి ఉబికి వచ్చిన శిలాద్రవం అంతా విస్తరించి ఉంటుంది. అందువల్ల ఈ పబ్లిక్ పార్కులో తరచుగా విలువైన వజ్రాలు దొరుకుతాయట. ఇక్కడకు వచ్చిన సందర్శకులు ఎవరైన డైమండ్ల కోసం వెతకొచ్చు. దొరికినవి వాళ్ల దగ్గరే ఉంచుకోవచ్చు లేదా అమ్ము కోవచ్చు. ప్రపంచంలోనే వజ్రాలు దొరికే ఏకైక పబ్లిక్ పార్క్ ఇదేనట. 1972 నుంచి ఇప్పటి వరకు దాదాపు 75 వేల వజ్రాలు దొరికాయంటే మాటలా మరి.

Tags

Read MoreRead Less
Next Story