Zelensky : రష్యా తో ఇక సమరమే

Zelensky : రష్యా తో ఇక సమరమే
డ్రోన్ దాడి అనంతరం జెలెన్ స్కీ వ్యాఖ్య

రష్యాకు ఇక యుద్ధం రాబోతుందన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. రష్యా చేస్తున్న ఎడతెగని యుద్ధంలో శ్మశానంలా మారిపోయిన ఉక్రెయిన్... ఇప్పుడు ఎదురు దాడికి పూర్తిగా సిద్ధమైంది. రెండు రోజుల క్రితం రష్యా రాజధాని మాస్కోపై మూడు డ్రోన్లతో దాడి చేసింది. మాస్కోకు దాదాపు 500 కిలోమీటర్ల దూరం నుంచి ఈ డ్రోన్లను ప్రయోగించింది. ఈ డ్రోన్లను రష్యా కూల్చినప్పటికీ రెండు బిల్డింగులు బాగా దెబ్బతిన్నాయి. ఈ దాడులతో అప్రమత్తమైన రష్యా... మాస్కోలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసింది.

అయితే రష్యా పై రివర్స్ అటాకింగ్ మొదలు పెట్టింది ఉక్రెయిన్. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ స్సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు యుద్ధం రష్యా వైపు వెళ్తోందని ఆయన అన్నారు. క్రమంగా యుద్ధం ఉక్రెయిన్ భూభాగం నుంచి రష్యా భూభాగం వైపు వెళ్తోందని చెప్పారు. రష్యా సైనిక స్థావరాలు, చారిత్రక కేంద్రాల వైపు యుద్ధం మళ్లుతోందని అన్నారు. ఇది ఒక అనివార్యమైన, సహజమై, న్యాయమైన ప్రక్రియ అని తెలిపారు. గత ఏడాది జరిగిన మాదిరే రష్యా టెర్రరిస్టులు తమ ఎనర్జీ సెక్టార్, కీలకమైన విభాగాలపై శీతాకాలంలో మళ్లీ దాడి చేసే అవకాశం ఉందనే విషయం తమకు తెలుసని... ఈసారి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తాము పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని తెలిపారు. ఉక్రెయిన్ ఇప్పుడు బలపడుతోందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story