Zombie Virus: ప్రపంచానికి ముంచుకొస్తున్న మరో ముప్పు..

Zombie Virus:  ప్రపంచానికి  ముంచుకొస్తున్న  మరో ముప్పు..
మరో ప్రాణాంతక మహమ్మారిగా జాంబీ వైరస్‌

ఇటీవల శాస్త్రవేత్తలు ఆర్కిటిక్ ప్రాంతంలో గడ్డకట్టిన స్థితిలో ఉన్న అత్యంత ప్రమాదకరమైన ‘‘ జాంబీ వైరస్’’ను గుర్తించారు. దాదాపుగా 48,500 ఏళ్లుగా ఆర్కిటిక్ ప్రాంతంలో ఇది గడ్డకట్టిన స్థితిలో ఉంది. ఆర్కిటిక్, ఇతర ప్రదేశాల్లో చాలా ఏళ్లుగా పలు వైరస్‌లు మంచులో నిద్రాణస్థితిలో ఉన్నాయి. అయితే వీటి వల్ల కలిగే ప్రమాదాల గురించి శాస్త్రవేత్తలు సంవత్సరాలుగా హెచ్చరిస్తున్నారు. ప్రమాదకర వైరస్ మానవుల్లో ప్రాణాంతకవ్యాధిని కలిగించే సామర్థ్యాన్ని కలిగించే అవకాశం ఉంది.

రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఉన్న మంచు సరస్సుల కింద లక్షన్నర సంవత్సరాల క్రితం సమాధి అయిన 13కొత్త రకాల వైరస్లను శాస్ర్తవేత్తలు సేకరించారని 2022లో తెలిసింది. కాగా ఇప్పుడు ఆర్కిటిక్ తదితర ప్రాంతాలలో మంచు కింద స్థంభింపజేసిన వైరస్ తిరిగి ఉనికిలోకి రాబోతోందని పరిశోధకులు చేబుతున్నారు. పెర్మాఫ్రాస్ట్ అనేది భూమి ఉపరితలంపై లేదా దిగువన శాశ్వతంగా ఘనీభవించిన పొర. ఈ పొర మట్టి, కంకర, ఇసుకతో మిళితమై ఉంటుంది. సాధారణంగా మంచుతో కలిసిపోయి ఉంటుంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ఘనీభవించిన మంచు కరగడం ప్రారంభించిందని, తొందరలోనే ఈ వైరస్లు ఉనికిలోకి రావొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. వీటి వల్ల ఎలాంటి నష్టం జరుగుతుందనే విషయం స్పష్టంగా తెలియక పోయినా ప్రమాదకరమైన వ్యాధులను వ్యాప్తి చేస్తాయని అంటున్నారు.


అయితే ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ వల్ల ధృవాల వద్ద ఉన్న మంచు క్రమంగా కరుగుతోంది. దీంతో ఈ వైరస్‌ల ముప్పు మరింతగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వైరస్ లపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా జాంబీ వైరస్ వల్ల వచ్చే ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ఫ్రెంచ్ శాస్త్రవేత్త, ఆర్కిటిక్ లో సేకరించిన వైరస్ లను మళ్లీ పునరుద్ధరించాడు. ఆర్కిటిక్ టండ్రా, అలస్కా, కెనడా, రష్యాలోని సైబిరియా ప్రాంతాలు అనేక పురాతన వైరస్ కు మంచులో గడ్డకట్టిన స్థితిలో కలిగి ఉన్నాయి. సాధారణంగా మంచు ప్రాంతాల్లో ఎన్నో రకాల డేంజరస్ వైరస్‌లు ఉంటాయి. మానవాళికి వాటి వల్ల ఏమైనా ముప్పు ఉందా? అనే విషయంపై శాస్త్రవేత్తలు ఎప్పుడూ పరిశోధనలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజా పరిశోధనలో ఈ జాంబీ వైరస్ బయటపడింది. ఇలాంటి బ్యాక్టీరియా, వైరస్ లను పునరుజ్జీవింపచేయడం ద్వారా మానవాళికి ఎంత ముప్పును కలిగిస్తాయో తెలుసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న యాంటీబయాటిక్స్ వల్ల బ్యాక్టీరియాను కొంతలో కొంత అరికట్టవచ్చు. అయితే వైరస్ ఇందుకు భిన్నంగా ఉంటుంది. సరైన వ్యాక్సిన్ లేకపోతే వైరస్ మానవాళిపై విధ్వంసం సృష్టిస్తుంది. ఇందుకు ఉదాహరణ కరోనా వైరస్. గతంలో సైబీరియాలో మంచు కరగడం వల్ల రెయిన్ డీర్ లలో ఆంత్రాక్స్ వ్యాప్తి కారణం అయిన విషయాన్ని పరిశోధకులు గుర్తు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story