చంద్రబాబుకు జగన్ ఫోన్

చంద్రబాబుకు జగన్ ఫోన్

తన ప్రమాణ స్వీకారానికి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబును ఆహ్వానించారు వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌. స్వయంగా చంద్రబాబుకు ఫోన్‌ చేసి తన ప్రమాణస్వీకారానికి రావాలని జగన్‌ కోరారు. తొలిసారిగా ముఖ్యమంత్రి పదవిని చేపట్టబోతున్న వైఎస్‌ జగన్‌ స్వయంగా చంద్రబాబును ఫోన్‌ చేసి ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను జగన్‌ ఇప్పటికే ఆహ్వానించారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈ నెల 30న మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ఏపీ ముఖ్యమంత్రిగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకార కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారా లేదా అన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.

Tags

Read MoreRead Less
Next Story