లారీ, ట్రావెల్స్‌ బస్సు ఢీ.. స్పాట్‌లోనే ముగ్గురు..

లారీ, ట్రావెల్స్‌ బస్సు ఢీ.. స్పాట్‌లోనే ముగ్గురు..

కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చిన్న టేకూరు వద్ద లారీ, ట్రావెల్స్‌ బస్సు ఢీకొన్నాయి. ముందు వెళ్తున్న లారీని.. ఎస్‌ఆర్‌ఎస్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్పాట్‌లోనే ముగ్గురు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతుండగా ప్రమాదం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story