క్రైమ్

వాట్సాప్‌లో భార్య.. అనుమానంతో భర్త..

వాట్సాప్‌లో భార్య.. అనుమానంతో భర్త..
X

సెల్‌ఫోన్‌ చాటింగ్ పచ్చటి కాపురంలో చిచ్చు రేపింది. అనుమానం పెనుభూతమై నిండు నూరేళ్లు తోడుంటానని చేసిన ప్రమాణాలను మరిచి భర్త భార్యను అతి కిరాతకంగా రాడ్డుతో కొట్టి చంపాడు.

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీనగర్‌లో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను రాడ్డుతో మోది హత్య చేశాడు భర్త‌. శ్రావణ్‌, మౌనికలు పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరి కాపురంలో సెల్‌ఫోన్‌ చిచ్చు పెట్టింది. మౌనిక వాట్సాప్‌లో వేరే వ్యక్తితో చాటింగ్‌ చేస్తుందనే అనుమానంతో శ్రావణ్ ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యతో తరచూ గొడవపడేవాడు శ్రావణ్‌. ఈ అనుమానంతోనే భార్య మౌనికను హత్య చేశాడు.

Next Story

RELATED STORIES