ప్రధాన పార్టీలను టెన్షన్‌ పెడుతున్న లోకల్‌ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు

వరంగల్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండటంతో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులకు భయం పట్టుకుంది. ఇన్ని రోజులూ ZTPC, MPTCలకు క్యాంపులను నిర్వహించి.. ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. కానీ ఇప్పుడు వారు ఓటు తమ పార్టీకే వేస్తారా.. లేక ప్లేట్‌ పిరాయిస్తారా అనే టెన్షన్‌ నెలకొంది. ఎన్ని హామీలు ఇచ్చైనా సరె.. జాగ్రత్తగా వారితో ఓటు వేయించుకోవాలని చూస్తున్నారు. ఓటర్లకు క్యాంపులలో ఓటు ఎలా వేయాలే అంశంపై ట్రైనింగ్ ఇచ్చినా.. వారు సక్రమంగా ఓటు వేస్తారా లేదా అనే టెన్షన్ నేతల్లో కనిపిస్తోంది. క్రాస్ ఓటింగ్ అయితే తాము గెలుస్తామా లేదా అనే భయం అన్ని ప్రధాన పార్టీల్లో భయం కనిపిస్తోంది.

వరంగల్ జిల్లాలో 902 మంది ఓటర్లు ఉండగా, నల్గొండలో 1086 మంది ఓటర్లు ఉన్నారు, రంగ రెడ్డి జిల్లాలో 812 ఓటర్లు ఉన్నారు. గడిచిన 20 రోజులనుంచి క్యాంపులు నిర్వహించిన అధికార పార్టీ.. ఓటింగ్ ఎలా వేయాలో మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. అయితే.. ఇందులో మెజారిటీ సభ్యులు పోలింగ్ సరిగా వేయలేకపోవడం ఆయా పార్టీల్ని టెన్షన్‌ పెట్టిస్తోంది. ఇప్పటివరకు ఓటర్లకు భారీగా ఖర్చు పెట్టి.. వారి గొంతెమ్మ కోరికలు తీర్చిన అభ్యర్థులు.. ఇప్పుడు ఓటు సరిగా పడకపోతే తమ పరిస్థితి ఏంటని ఆందోళన లో వున్నారు.

Tags

Read MoreRead Less
Next Story