'నాన్నా లే.. ప్లీజ్‌'.. హృదయాలను కలచివేసిన బాలిక రోదన..

నాన్నా లే.. ప్లీజ్‌.. హృదయాలను కలచివేసిన బాలిక రోదన..

రోడ్డు ప్రమాదంలో తండ్రిని కోల్పోయిన ఓ అమ్మాయి హృదయ విదారకమైన రోదన అందరి హృదయాలను కలిచివేస్తోంది. నాకు నా తండ్రి కావాలంటూ, కన్నీరుపెడుతూ ఘటనా స్థలం వద్దే భోరున విలపిస్తున్న బాలికను ఓదార్చడం ఎవరి వల్లా కాలేదు.

నల్గొండ జిల్లా కేంద్రానికి సమీపంలోని చెర్లపల్లిలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కామినేని ఆస్పత్రిలో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెళ్తున్న సమయంలో వారిని డీసీఎం డీకొట్టింది. తలపైనుంచి టైర్‌ ఎక్కేయడంతో.. ఇద్దరిలో ఒకరు స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. తండ్రి మరణాన్ని చూసి షాక్‌కి గురైన అమ్మాయి.. ఎలాగైనా ఆయన్ను బతికించాలంటూ గుండెలు పగిలేలా ఏడ్చింది.

Tags

Read MoreRead Less
Next Story