పట్టపగలే వ్యక్తిని వెంబడించి.. వేటకొడవళ్లతో నరికి..

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారంలో దారుణ హత్య జరిగింది. పట్టపగలే ఓ వ్యక్తిని వెంబడించిన దుండగులు, జాతీయ రహదారిపై వేటకొడవళ్లతో నరికి చంపారు. అందరూ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. దుండగులు హత్య చేస్తుంటే ఎవరూ ఆపే ప్రయత్నం చేయలేదు. హత్య అనంతరం నిందితులు బైక్‌పై పరారయ్యారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న వాహనదారులు సెల్ ఫోన్లో రికార్డు చేశారు.
హత్య విషయం తెలుసుకొని పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతున్ని మహబూబ్ బాషాగా గుర్తించారు. అతను ఐదు నెలలక్రితం లక్డారంలో జరిగహర్షద్ హుస్సేన్ మర్డర్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్నాడని పోలీసులు తెలిపారు. పాతకక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
గతంలో హత్యకు గురైన హర్షద్ హుస్సేన్ అనుచరులు లేదా బంధువులే చంపారని భావిస్తున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com