క్రైమ్

దారుణం.. కూలీ పనికి రాలేదని ఇద్దరిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి..

దారుణం.. కూలీ పనికి రాలేదని ఇద్దరిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి..
X

చిత్తూరు జిల్లా మదనపల్లెలో దారుణం జరిగింది. కూలీ పనికి రాలేదని ఇద్దరు యువకులను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేశాడు మేస్త్రీ. పుంగనూరు రోడ్డు దగ్గరున్న జ్యూస్‌ ఫ్యాక్టరీ సమీపంలో ఇద్దరు యువకుల మృతదేహాలను గుర్తించారు. వీరు మొలకలదిన్ని గ్రామానికి చెందిన హరి, నాగభూషణం. వీరిద్దరూ… బసినికొండ గ్రామానికి చెందిన నాగేంద్ర నాయక్‌ వద్ద కూలి పనులు చేసేవారు. ఇద్దరు యువకులు ట్రాక్టర్‌లో ఇసుక నింపడానికి వెళ్లి తమ ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మధ్యలో పని వదిలిపెట్టి వెళ్లబోయారు. ఇదే సమయంలో మేస్త్రీ నాగేంద్ర నాయక్‌ ఇద్దరు యువకులను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేశాడు. తమకు న్యాయం చేయాలంటూ మృతుల కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

Next Story

RELATED STORIES