ఎంపీటీసీ కిడ్నాప్‌కు టీఆర్ఎస్ నేతల యత్నం

ఎంపీటీసీ కిడ్నాప్‌కు టీఆర్ఎస్ నేతల యత్నం

పరిషత్ ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందే అరాచకాలు మొదలయ్యాయి. నిజామాబాద్ నగరంలోని కౌంటింగ్ కేంద్రం వద్ద బీజేపీ MPTCని TRS నేతలు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. వారిని BJP నేతలు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. మాక్లూర్ మండలం గొట్టుమక్కల గ్రామ MPTCగా BJP అభ్యర్థి బెంగరి సత్తెమ్మ గెలిచారు. ధృవీకరణ పత్రం తీసుకుని కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకురాగానే... సత్తెమ్మను బలవంతంగా క్యాంప్ కు తరలించేందుకు TRS నేతలు ప్రయత్నించారు. కారులో ఎక్కిస్తుండగా BJP నేతలు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉధ్రిక్తంగా మారింది. పోలీసుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. సత్తెమ్మను భర్త బైక్ పై ఎక్కించి ఇంటికి పంపారు.

Tags

Read MoreRead Less
Next Story