పండుగ రోజున ఇంటికి వస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను ...

పండుగ రోజున ఇంటికి వస్తున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ను ...

కడప జిల్లా రైల్వే కోడూరులో దారుణ హత్య కలకలం రేపింది. స్థానిక రంగనాయకులపేటకు చెందిన సాబ్జాన్‌ -హసీనా దంపతుల కుమారుడు అబ్దుల్‌ ఖాదర్‌ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ..ఈ రోజు రంజాన్‌ కావడంతో అబ్దుల్‌ ఖాదర్‌ నిన్నరాత్రి బెంగుళూరు నుంచి బయలు దేరి ఈ రోజు ఉదయం 5 గంటలకు రైల్వే కోడూరుకు చేరుకున్నాడు. ఇంటికి వెళుతుండగా మార్గ మధ్యంలో కృష్ణ థియేటర్‌ పక్కన కొందరు దుండగులు ఖాదర్‌ను కత్తులతో దారుణంగా నరికి చంపారు.

మరోవైపు.. ఖాదర్‌కు ఈ నెల 23న తన మేనత్త కూతురుతో వివాహం నిశ్చయమైంది. ఎంతో సంతోషంగా రంజాన్‌ పండుగ జరుపుకునేందుకు బెంగుళూరు నుంచి వచ్చిన తమ కుమారుడు దారుణ హత్యకు గురికావడంతో తల్లిదండ్రులు భోరున విలపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story