జెడ్పీ ఛైర్మన్లుగా మాజీ ఎమ్మెల్యేల సతీమణులు.. సునీతా మహేందర్‌రెడ్డికి..

జెడ్పీ ఛైర్మన్లుగా మాజీ ఎమ్మెల్యేల సతీమణులు.. సునీతా మహేందర్‌రెడ్డికి..

పరిషత్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జెండా రెపరెపలాడింది. 32 జిల్లా పరిషత్‌లూ గులాబీ వశమయ్యాయి. మరి జెడ్పీ చైర్మన్లు ఎవరు? జడ్పీటీసీలుగా గెలిచిన వారిలో ఆ అదృష్టం వరించనున్న నేతలు ఎవరన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. రేసులో పలువురు మాజీ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలు ఉన్నారు. వీరిలో కొందరి పేర్లు ముందే ఖరారు కావడంతో వారంతా ఆనందంలో తేలిపోతుండగా... మరికొంత మంది అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఆసిఫాబాద్‌ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్‌రెడ్డి, మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు జడ్పీ చైర్మన్‌ రేసులో ఉన్నారు. స్వర్ణ సుధాకర్‌రెడ్డిని జడ్పీ చైర్‌ పర్సన్‌ చేస్తానని సీఎం కేసీఆర్‌ నుంచి ఇప్పటికే స్పష్టమైన హామీ లభించింది. పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ ఎన్నిక లాంఛనమే అని తెలుస్తోంది.

ఇక మంచిర్యాలో చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు సతీమణి భాగ్యలక్ష్మిని జడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించారు కేసీఆర్‌. రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌గా మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు తీగల అనితారెడ్డి, వికారాబాద్‌ జడ్పీ చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి సతీమణి సునీతా మహేందర్‌రెడ్డి ఎన్నికయ్యే అవకాశం ఉంది. వీరితో పాటు మరికొంత మంది ఎమ్మెల్యేల భార్యలు, మాజీ ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story