వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్.. రేపు జరగబోయే..
ఏపీ కేబినెట్‌లో చోటు దక్కేదెవరికి? పాత కొత్త కలయికతో మంత్రి వర్గ కూర్పు ఉండబోతోందా? మంత్రి వర్గ ఏర్పాటుపై ఏపీ సీఎం జగన్ కసరత్తు ముమ్మరం చేశారు. సామాజిక సమీకరణాలు, జిల్లాల లెక్కలను పరిగణలోకి తీసుకుని కేబినెట్ కూర్పుపై దృష్టిసారించారు. 151 సీట్లతో వైసీపీ భారీ విజయం సాధించడంతో... మంత్రి పదవులు ఆశించే ఆశావహుల సంఖ్య భారీగా పెరిగింది.
మంత్రి పదవి కోసం ఎమ్మెల్యేలు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అధినేతను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. సామాజిక సమీకరణాలు, జిల్లా కోణంలో లెక్కలు వేసుకుని మరీ కొంత మంది నేతలు... తమకు ఖచ్చితంగా మంత్రి పదవి ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే అధినేత మనుసులో ఎవరు ఉన్నారో? మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయో అన్నది ఆ పార్టీ నేతలను తెగ టెన్షన్ పెట్టిస్తోంది.
ఎల్లుండి మంత్రి వర్గ ప్రమాణస్వీకారం జరగనుంది. కేబినెట్ ఏర్పాటుకు ఒకరోజు ముందే.. అంటే రేపు జరగనున్న పార్టీ శాసనసభాపక్ష సమావేశంలోనే మంత్రివర్గ జాబితాను జగన్ ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంత్రి పదవులు ఎందుకు ఇచ్చామో? ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నామో సీఎం జగన్ ఎమ్మెల్యేలకు వివరించనున్నారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com