భారత్,ఆస్ట్రేలియా మ్యాచ్‌లో మహేశ్,వంశీ సందడి

టీమిండియా-ఆస్ట్రేలియా .జట్ల మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాలీవుడ్ టాప్ హీరో మహేశ్‌బాబు, దర్శకుడు వంశీ పైడిపల్లి సందడి చేశారు. ప్రస్తుతం బ్రిటన్ టూర్‌లో ఉన్న మహేశ్ ప్యామిలీతో కలిసి క్రికెట్ మైదానానికి చేరుకున్నారు. అలాగే వంశీ కూడా వారితో కలిశారు. ఈ సందర్భంగా మహేశ్, నమ్రత, గౌతమ్‌లతో కలిసి దిగిన సెల్ఫీని వంశీ ట్విటర్‌లో షేర్ చేశారు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా..’ అంటూ ‘సెలబ్రేటింగ్ మహర్షి’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్వీటర్‌లో పోస్ట్ పెట్టారు. టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాంటిగ్‌లో ఇండియా బ్యాట్‌మెన్స్ చెలరేగిపోయారు. స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. రోహిత్(57; 70బంతుల్లో 3×4, 1×6) ధావన్(117; 109బంతుల్లో 16×4, 3×6) పరుగులతో చెలరేగారు.
#INDvAUS.. At the Oval.. :)#CelebratingMaharshi pic.twitter.com/eINFf18umX
— Vamshi Paidipally (@directorvamshi) June 9, 2019
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com