కీలక నిర్ణయం దిశగా జగన్..రేపు..

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో రేపు ఆర్టీసీ సంఘాలు భేటీ కానున్నాయి. తమ సమస్యలు, డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెలని నిర్ణయించారు ఆర్టీసీ జేఏసీ నేతలు. జగన్‌తో భేటీ అయిన తర్వాత తాము నిర్వహించే సమ్మెపై క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తారన్న వార్తలపై సమ్మెపై సస్పెన్స్‌ కొనసాగుతోంది.

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి హామీ లభించినట్లు ఈయూ నేతృత్వంలో ఏర్పాటైన జేఏసీ నాయకులు తెలిపారు. సమ్మెకు పిలుపిచ్చిన కార్మికులతో రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు చర్చలు జరిపారు. సమావేశంలో కార్మికుల సమస్యలను జేఏసీ కన్వీనర్‌ పలిశెట్టి దామోదర్‌రావు కృష్ణబాబుకు వివరించారు.

అయితే ఆర్టీసీ విలీనం గురించి సీఎంతో హామీ ఇప్పిస్తే, జేఏసీలో చర్చించి నిర్ణయం చెబుతామని జేఏసీ నేతలు బదులిచ్చారు. రేపు సీఎంతో భేటీ ఏర్పాటు చేస్తానని కృష్ణబాబు చెప్పడంతో సమ్మె సన్నాహక సభలు వాయిదా వేసినట్లు ప్రకటించారు. జగన్‌ ఇచ్చే హామీ తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు. కాగా, ఆర్టీసీ కార్మికులపట్ల సానుకూలంగా ఉన్న ప్రభుత్వం.. సంస్థను కాపాడేందుకు సముచిత చర్యలు తీసుకోబోతున్నట్లు మజ్దూర్‌ యూనియన్‌ పేర్కొంది. దీనిపై కేబినెట్‌లో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story