ఆయన గెలిస్తే మంత్రే అన్న జగన్.. కాబోయే మంత్రి అంటూ ఫ్లెక్సీలు కట్టిన కార్యకర్తలు..కానీ..
సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులు, వైఎస్సార్‌సీపీలో ఫైర్‌బ్రాండ్‌గా ముద్రపడిన వారికి.. పార్టీలో మొదటి నుంచి తన గళాన్ని బలంగా వినిపించిన వారికి నిరాశే దక్కింది. కృష్ణా జిల్లా జగ్గయ్య పేట నుంచి గెలిచిన ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మంత్రి రేసులో ఉన్నారంటూ తొలినుంచి జోరుగా ప్రచారం జరిగింది. కార్యకర్తలు సైతం కాబోయే మంత్రివర్యులు సామినేని ఉదయభాను భారీగా ఫ్లెక్సీలు కట్టి అనందపడ్డారు. అయితే వారి ఆశలు ఎంతో సేపు నిలవలేదు. కార్యకర్తలు, అనుచరుల ఎక్స్ పెక్టేషన్స్ జగన్ పటాపంచలు చేశారు. అటు పెడన వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. తొలి నుంచి పార్టీకి వెన్నంటి ఉన్న ఆయనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందని కార్యకర్తలు భావించారు. అయితే జగన్ జోగిరమేష్‌కు కేబినేట్‌లో చోటు కల్పించలేదు.
వైసీపీ అవిర్భావం నుంచి పార్టీని అంటిపెట్టుకున్న గుంటూరు జిల్లా నేతలకు బంగపాటు తప్పలేదు. మర్రి రాజశేఖర్ చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. అయితే ఇక్కడ్నుంచి విడదల రజనీకి టికెట్ ఇచ్చిన వైఎస్ జగన్.. ఆమెను గెలిపించుకుని వస్తే.. మర్రికి మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో సైతనం జగన్ మర్రికి మంత్రి పదవి ఇస్తానని ప్రకటించారు. కానీ మంత్రి వర్గంలో ఆయనకు చోటు కల్పించలేదు.
మంగళగిరిలో హోరాహోరీ పోరులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌పై గెలిచిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి జగన్ కేబినెట్‌లో చోటు దక్కుతుందని చాలా మంది భావించారు. మంగళగిరిలో గెలిస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తానని ఎన్నికల ప్రచారంలో స్వయంగా వైఎస్ జగనే చెప్పారు. కానీ, తుదికూర్పులో ఆయనకు కూడా నిరాశే దక్కింది.
అటు వైసీపీ అవిర్భావం నుంచి సీఎం జగన్‌కు చేదోడువాడోడుగా ఉన్న సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటిరాంబాబుకు ఆశాభంగం తప్పలేదు. జగన్‌కు అత్యంత సన్నిహితుగా పార్టీ అవిర్భావం నుంచి ఉన్నారు. నాడు రోశయ్య ప్రభుత్వంపై విమర్శలు కుప్పించారు. అటు చంద్రబాబు ప్రభుత్వం జగన్ పై చేసే విమర్శలకు దీటు సమాధానం ఇచ్చేవారు. వాయిస్ ఆప్ పార్టీగా ఉన్న ఆయనకు జగన్ తన మంత్రి వర్గంలో చోటు కల్పించలేదు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను దీటుగా ఎదుర్కొని గెలుపొందిన అంబటిని కేవలం పార్టీ వాయిస్‌కే వారిని పరిమితం చేశారా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
జగన్ మంత్రివర్గంలో అనుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి, మర్రిరాజశేఖర్ , కోలగట్ల వీరభద్రస్వామికి దాదాపు మంత్రివర్గంలో చోటు ఖాయం అనుకున్నారు. కార్యకర్తలు, నేతలతో పాటు అధికారులు సైతం పుష్పగుచ్చాలు ఇచ్చి వారికి అభినందనలు తెలిపారు. అయితే వారి ఆశలు పటాపంచలు చేశారు జగన్. ఈసారి కేబినెట్‌లో అయినా బెర్త్ ఉంటుందా లేదా అని ఆశాతో ఎదురుచూస్తున్నారు నేతలు, కార్యకర్తలు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com