గవర్నర్ మారనున్నారా..?..తెలంగాణ గవర్నర్‌గా..

తెలుగు రాష్ట్రాల గవర్నర్ మారానున్నారా..? రెండు రాష్ట్రాలకు వేరే వేరు గవర్నర్‌లను కేంద్రం నియమించనుందా..? తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో.. గవర్నర్ నరసింహన్ భేటీ తరువాత.. ఈ ఊహాగానాలు ఇంకాస్త పెరిగాయి.. అయితే తాను మాత్రం మర్యాదపూర్వకంగానే అమిత్ షాను కలిశాను అన్నారు నరసింహన్.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ భేటీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు వస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఇదే విషయంపై అమిత్ షా-గవర్నర్‌ల మధ్య భేటీ జరిగినట్టు తెలుస్తోంది.గవర్నర్ నరసింహన్ మాత్రం కేవలం మర్యాద పూర్వకంగానే హోంమంత్రిని కలిశానన్నారు. తెలుగు రాష్ట్రాల తాజా రాజకీయ పరిణామాలపై అమిత్ షాకు వివరించానన్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు బాగానే ఉన్నాయన్నారు గవర్నర్. దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భవనం అంశం కూడా చర్చకు వచ్చిందన్నారు. అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అమిత్ షాతో గవర్నర్ భేటీ అయిన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రెండోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో గవర్నర్లు మార్చే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో గవర్నర్లను మార్చాలని కేంద్రం భావిస్తున్నట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. తెలంగాణ రాష్ట్రానికి మాజీ కేంద్ర మంత్రి సుష్మస్వరాజ్ లేదా పాండిచ్చేరి గవర్నర్ కిరణ్‌బేడీలలో ఎవరినో ఒకరిని గవర్నర్‌గా నియమించే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. అయితే ఇప్పటికే సుష్మా స్వరాజ్ ఏపీకి గవర్నర్‌గా నియమించినట్టు వస్తున్న వార్తలను ఆమె ఖండించారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com