'సాహో' కోసం వెయిట్ చేస్తున్నా: అనుష్క

సాహో కోసం వెయిట్ చేస్తున్నా: అనుష్క

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో.. తాను కూడా అంతే క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నానంటోంది అందాల తార అనుష్క. ప్రభాస్, తాను కలిసి నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. ఇప్పుడు ఈ సినిమాలో తాను హీరోయిన్‌గా నటించకపోయినా అనుష్క అమితంగా ఇష్టపడే హీరో ప్రభాస్. సుజిత్ దర్శకత్వంలో రూపు దిద్దుకున్న సాహో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది.

శ్రద్ధా కపూర్ నాయికగా నటిస్తోన్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. యాక్షన్స్ సీన్స్ అద్భుతంగా ఉన్నాయంటూ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇండస్ట్రీకి చెందిన చాలా ప్రముఖులతో పాటు అనుష్క కూడా టీజర్‌పై తన స్పందనను వ్యక్తం చేసింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ వారికి, ప్రభాస్‌కి, సుజీత్‌కి, మిగతా యూనిట్ సభ్యులకు అభినందనలు అంటూ.. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో పోస్ట్ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story