దాచేపల్లిలో ఉద్రిక్తత.. గ్రామం వదిలేసిన 250 టీడీపీ కార్యకర్తల కుటుంబాలు

గుంటూరు జిల్లా దాచేపల్లి మండలంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఫ్యాక్షన్ నివురుగప్పిన నిప్పులా మారింది. పిన్నెల్లి గ్రామంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్నభయంతో ప్రజలు గ్రామం వదిలిపారిపోయారు. టీడీపీ సానుభూతి పరులైన దాదాపు 250 కుటుంబాలు పిన్నెల్లి గ్రామం వదిలి.. సమీపంలోని గామాలపాడులో తలదాచుకుంటున్నారు.
గామాలపాడులో తలదాచుకుంటున్న టీడీపీ కుటుంబాలను పార్టీ తెలుగుయువత అధ్యక్షుడు దేవినేని అవినాష్ పరామర్శించారు. వారికి ధైర్యంచెప్పే ప్రయత్నం చేశారు. పోలీసుల తీరుపై మండిపడ్డారు. మాకు రక్షణ కల్పిస్తారో.. మాకు మేమే రక్షణగా ఉండాలంటారో పోలీసులు చెప్పాలన్నారు. పల్నాడు సంఘటనలపై త్వరలోనే టీడీపీ ఉన్నతస్థాయి కమిటీ పర్యటించి.. వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుందన్నారు అవినాష్ గ్రామాల్లో మహిళలకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు.
అధికారంలోక వచ్చిన వైసీపీ పాలన వదిలేసి.. ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరతీసిందన్నారు. ప్రజలను హింసించడం ద్వారా వైసీపీ కార్యకర్తలు రాక్షసానందం పొందుతున్నారని.. దేవినేని అవినాష్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అల్లర్లపై ముఖ్యమంత్రి జగన్ స్పందించాలన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com