ఇదేనా మీ రాజన్న రాజ్యం:లోకేష్‌

ఇదేనా మీ రాజన్న రాజ్యం:లోకేష్‌

ఏపీలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ట్విట్టర్‌ వేదికగా వార్‌ నడుస్తోంది.. రోజుకో అంశాన్ని ఎత్తిచూపుతో ట్విట్టర్‌ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు సంధిస్తున్నారు టీడీపీ నేత లోకేష్‌.. తాజాగా రాష్ట్రంలో రైతులకు సీఎం జగన్‌ విత్తనాలు అందించలేకపోతున్నారని లోకేష్‌ ట్వీట్‌ చేశారు. అలాంటి ముఖ్యమంత్రి రాష్ట్రానికి నీళ్లు తెస్తానంటూ పక్క రాష్ట్ర సీఎంతో చర్చలకు వెళ్లారట అంటూ ఎద్దేవా చేసారాయన. అనంతపురం, విజయనగరం, నెల్లూరు.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల 'విత్తనాలో జగన్ గారూ' అంటూ రోడ్డెక్కుతున్నారని వీడియోలను సైతం ట్విట్టర్‌లో పోస్టు చేశారు లోకేష్.

రాజన్న రాజ్యం అంటే విత్తనాలు, ఎరువుల కోసం క్యూలైన్‌లో ఎదురుచూపులు, లాఠీఛార్జ్‌ల్లో దెబ్బలు తినాలని మరోసారి గుర్తుచేశారంటూ లోకేష్‌ విమర్శించారు. ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో అవినీతి అంటూ తమపై బురద జల్లే కార్యక్రమాలతో కాలయాపని మానుకోవాలన్నారు. రైతులకు విత్తనాలు అందంచే పని మొదలుపెట్టండని సూచించారు.

Tags

Next Story