భర్త వద్దు.. ఆమే ముద్దు..

భర్త వద్దు.. ఆమే ముద్దు..

పెళ్లి వయసు వచ్చినా ఇంకా ఇప్పుడే వద్దంటావేంటి.. నోరుమూసుకుని కూర్చో అని ఓ వరుడ్ని వెతికి మూడు ముళ్లు వేయించారు. తమ పనై పోయిందనుకున్నారు. అమ్మాయిగా అతడికి అర్థాంగి అయిందేమో కానీ మనసు, తనువు మరొకరికి ఇచ్చేసింది. ఆ విషయం పెళ్లయిన వారం రోజుల్లోపే ఆమె జంప్ అయ్యేసరికి ఇంట్లో వారికి తెలిసింది. ఆ ఇచ్చింది అబ్బాయికి కూడా కాదు అమ్మాయికి అని తెలిసి అవాక్కయ్యారు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా నాగర్ కోయిల్‌కు చెందిన యువతికి అదే ప్రాంతానికి చెందిన యువకుడితో వారం రోజుల క్రితం వివాహం జరిపించారు పెద్దలు. పెళ్లైన నాలుగు రోజులకే పెట్టే బేడా సర్ధుకుని ఆమె వెళ్లి పోయింది.

యువతి బంధువులకు భర్తపైనే అనుమానం వచ్చింది. అయ్యో నాకేం తెలియదు. నాతో కూడా సరిగా లేదు. ఈ నాలుగు రోజులు ముభావంగానే ఉంది అని అన్నా వినిపించుకోకుండా అతడి మీదే కంప్లైంట్ చేశారు. దీంతో పోలీసులు అతడిని విచారంచారు. వారి ఎంక్వైరీలో భార్యకు భర్త పట్ల ఇష్టం లేదని తెలుసుకున్నారు. ఆమె స్నేహితులను కలిసి వారితో మాట్లేడేసరికి విషయం వెలుగులోకి వచ్చింది. తిరునల్వేలి జిల్లా పనకుడికి చెందిన స్నేహితురాలితో ఆమె చాలా సన్నిహితంగా ఉండేదని తెలుసుకున్నారు. హాస్టల్లో ఉన్నప్పుడు స్వలింగ సంపర్కానికి అలవాటు పడ్డారని స్నేహితులు పోలీసులకు సమాచారం అందించారు. పనకుడిలో విచారించగా.. ఇద్దరూ కలిసి పరారైనట్లు తెలుసుకున్నారు. తిరునల్వేలి నుంచి చెన్నైకు రైల్లో వెళ్లినట్లు గుర్తించారు. చెన్నై పోలీసులను అప్రమత్తం చేసి వారి కోసం గాలిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story