ప్రభుత్వ ఇంజనీర్‌పై బురద పోసి అవమానించిన ఎమ్మెల్యే

బిజెపి ఎమ్మెల్యే ఆకాశ్ విజయవర్గీ దుందుడుకు చర్య మరవముందే మరో ఎమ్మెల్యే అధికారి దాడి చేశాడు. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేశ్ రాణా అనుచరులతో కలిసి ఓ ప్రభుత్వ ఇంజనీర్‌పై దాడికి దిగాడు. ముంబై-గోవా హైవేపై ఏర్పడిన గుంతలను పరిశీలిస్తున్న ఆ ఎమ్మెల్యే వాటి చూసి ఆగ్రహానికి గురై అక్కడ ఉన్న ఇంజనీర్‌పై బురద పోశారు. అనంతరం అతన్ని బ్రిడ్జికి కట్టేసేందుకు ప్రయత్నించారు. దీనికి సంబందించిన వీడియో వైరల్‌గా మారడంతో నెటిజన్స్ నితేశ్ రాణాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ నేత నారాయణ్ రాణా కుమారుడే నితీశ్ రాణా.
ఈ మధ్మ ప్రభుత్వాధికారులపై ప్రజాప్రతినిధుల దాడులు ఎక్కువయ్యాయి. ఇండోర్-3 నియోజక వర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ విజయ్‌వర్గారియా మున్సిపల్ అధికారిని బ్యాట్‌తో చితక్కొట్టారు . అలాగే ఆసిఫాబాద్ జిల్లాలో మహిళా ఎఫ్‌ఆర్వోపై టీఆర్‌ఎస్ నేతలు దాడి చేసిన సంగతి తేలిసిందే. తాజాగా ఈ జాబితాలో కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా చేరారు.
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com